Agriculture

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ-NewsRoundup-Apr 20 2024

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ-NewsRoundup-Apr 20 2024

* ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని, తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ర్యాలీలో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొదటి దశలో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు.

* ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదిక వ్యాఖ్యానించారు.

* అంతర్జాతీయ వేదికపై అమెరికా (USA)- చైనా (China)ల ఆధిపత్య పోరు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ (Pakistan) క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయంటూ.. మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్‌కు చెందిన ఓ కంపెనీపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు ఇస్లామాబాద్‌తో సామూహిక విధ్వంసకర ఆయుధాలతో చేపట్టే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూమిల్లర్ తెలిపారు.

* ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించాం. కాంగ్రెస్‌ను ఓడించి.. ఇచ్చే ఇళ్లను రద్దు చేయాలని దిల్లీలో ఉండే మోదీ, గజ్వేల్‌లో ఉండే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు.’’ అని రేవంత్‌ విమర్శించారు.

* సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా తొలివిడత ఓటింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో తళుక్కున మెరిసిన ఓ పోలింగ్‌ ఏజెంట్‌ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన ఈశా అరోడా (Isha Arora). యూపీలోని సహరణ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్‌ ప్రాంతంలో ఈశా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

* సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో జస్టిస్ చంద్రచూడ్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందన్నారు.

* సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోదీ (PM modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె దీనిపై మాట్లాడారు.

* హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందన్నారు.

* అమెరికా (USA)లో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు (Indian Origin Students) వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి గత నెల ప్రారంభంలో శవమై కనిపించాడు. ఆ ఆత్మహత్యకు ‘బ్లూవేల్ ఛాలెంజ్’(Blue Whale Challenge) అనే గేమ్ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిని ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. ఒక గేమ్ కారణంగా అతడు మృతి చెంది ఉంటాడా? అని ప్రశ్నించగా.. ‘‘దానిపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ కేసును మూసివేయడానికి ముందు వైద్య పరీక్షల తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని చెప్పారు. చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. ఈ తరుణంలో ఈ సూసైడ్‌ గేమ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. మొదట రష్యాలో మొదలైన ఈ ఆన్‌లైన్‌ గేమ్‌.. చివరకు అది ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ కేసులు అధికారిక ధ్రువీకరణకు నోచుకోలేదు. దాంతో అనుమానిత బ్లూవేల్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లను పలు దేశాలు మూసివేశాయి. ఇక, ఈ గేమ్‌లో సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్‌ ఆటగాళ్లకు పలు ప్రమాదకర టాస్క్‌లను ఇస్తుంటాడు. అందులో మొదటి టాస్క్‌ల్లో భాగంగా మధ్య రాత్రిలో నిద్ర లేవడం, భయానక దృశ్యాలు వీక్షించడం వంటివి ఉండొచ్చు.

* జగన్‌ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఐదుగురు అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్‌, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి దోచుకుంటుంటే ఆరో వ్యక్తి కాకాణి దోపిడీ యథేచ్చగా జరుగుతోందన్నారు.

* సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ (Gujarat) రాజకీయాల్లో హేమాంగ్ జోషి (Hemang Joshi) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అతిపిన్న వయస్కుడైన అభ్యర్థి అయిన ఆయన.. ప్రధాని మోదీ (Modi) పదేళ్ల క్రితం పోటీ చేసిన స్థానం నుంచి బరిలో నిలిచారు. అసలు తనకు టికెట్ వస్తుందని అనుకోని జోషి.. వడోదర (Vadodara) నుంచి పోటీ చేయాలని అగ్రనాయకత్వం ఆదేశించడంతో అమితానందం వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, యూపీలోని వారణాసి నుంచి మోదీ పోటీ చేశారు. రెండుచోట్ల విజయం సాధించడంతో వడోదర స్థానాన్ని రంజన్‌ భట్‌కు కేటాయించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికతో పాటు 2019 పోటీలో విజయం సాధించిన భట్‌కు ఈసారి కూడా కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే అంతర్గతంగా వచ్చిన అసమ్మతి కారణంగా ఆయన వైదొలిగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజే విద్యార్థి నాయకుడైన జోషికి ఆ టికెట్ దక్కింది. పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. అందులో చాలామందికి సిబిల్‌్ స్కోరు అంటే ఏమిటో తెలియదు. అది లేకపోవడం వారికి శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం ‘స్వనిధి’ పథకం కింద రూ.10 వేలు, రూ.20 వేల రుణాన్ని సులభంగా పొందిన వ్యాపారులు రూ.50 వేల రుణానికి నోచుకోవడం లేదు. సిబిల్‌ స్కోరు తక్కువగా ఉందనే కారణంతో వీధి వ్యాపారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో వేలాది మంది వీధి వ్యాపారులు నష్టపోతున్నారు. మొదటి, రెండో విడతల్లో రుణాలు పొందిన వ్యాపారులు మూడో విడతకు వచ్చే సరికి లబ్ధిదారుల సంఖ్య భారీగా పడిపోయింది.

* సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) వేళ రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రధాన నాయకులంతా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ (Congress) నేత డీకే శివకుమార్‌ (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారంలో భాగంగా డీకే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

* సీనియర్‌ కెమెరామెన్‌ చోటా కె నాయుడితో పని చేసిన అనుభవం తనని బాధ పెట్టినా, ఆయనకున్న అనుభవంతో కొన్ని విషయాలను నేర్చుకున్నానని, అందుకే ఆయనంటే తనకు గౌరవమని, దాన్ని చోటా (ChotaKNaidu) నిలబెట్టుకోవాలని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 22న ఉదయం 11గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ప్రకటిస్తారని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

* రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్‌ కంపెనీని సందర్శించి కూలీలతో మాట్లాడారు. ‘‘మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్‌ నిరంతరం పరితపిస్తారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆర్థిక ఇబ్బందులు మహిళ విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ప్రకటించారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణం లభిస్తుంది. ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రొఫెషనల్‌ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్‌-6 పథకాలను ప్రకటించారు. మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత అందించాలని నారా లోకేష్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీరంతా ఆయనను ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారు’’ అని బ్రాహ్మణి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z