Politics

కంగనాను కొట్టిన విమానాశ్రయ కానిస్టేబుల్-NewsRoundup-June 06 2024

కంగనాను కొట్టిన విమానాశ్రయ కానిస్టేబుల్-NewsRoundup-June 06 2024

* బాలీవుడ్‌ నటి, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్‌ (కంగన రనౌత్)కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గురువారం మధ్యాహ్నం దిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ విమానాశ్రయంలో బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా నటి చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. కంగన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి సీటు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కంగన స్పందించారు. తాను బాగానే ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. సెక్యూరిటీ చెకింగ్‌ పూర్తయి పాస్‌ కోసం వేచి చూస్తుండగా.. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్‌ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తనను దూషించారన్నారు. ఇందుకిలా చేశావని అడగ్గా.. రైతులకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్లు కంగన తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని.. కాకపోతే పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉందన్నారు.

* ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎంపీలతో పార్టీ అధినేత, కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పు.. తెదేపాకు ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లకు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రధానమంత్రి నెరవేరుస్తారా? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. మరోవైపు మోదీ 3.ఒ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నామని పదే పదే ప్రచారం జరుగుతోందని, కానీ, ఈసారి అది మోదీ 1/3 ప్రభుత్వమేనని విమర్శించింది. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌.. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లకు సంబంధించి నాలుగు ప్రశ్నలు సంధిస్తూ ‘ఎక్స్‌’లో ఓ వీడియో పోస్టు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఏప్రిల్‌ 30, 2014న తిరుపతి వేదికగా హామీ ఇచ్చారు. తద్వారా భారీస్థాయిలో పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటికి పదేళ్లయ్యింది.. కానీ, అది జరగలేదు. ఇప్పడు ఆ హామీ నెరవేరుతుందా? ఏపీకి ప్రధానమంత్రి ప్రత్యేక హోదా కల్పిస్తారా?’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. అంతేకాకుండా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. దీన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ఇప్పుడైనా ఆ ప్రైవేటీకరణను అడ్డుకుంటారా? అని నిలదీశారు.

* భారత (ఈందీ) సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (ఫం ంఒది)కి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తైవాన్‌ (టైవన్) నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే కూడా కంగ్రాట్స్‌ చెప్పగా.. ఆ పోస్ట్‌కు మోదీ బదులిచ్చారు. అయితే, దీన్ని చైనా (ఛిన) తట్టుకోలేకపోయింది. తైవాన్‌ అధికారుల రాజకీయాలను న్యూదిల్లీ ప్రతిఘటించాలంటూ డ్రాగన్‌ మనపై నోరు పారేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందడంపై హర్షం వ్యక్తంచేస్తూ తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ విజయానికి గానూ నరేంద్రమోదీకి అభినందనలు. మీ నాయకత్వంలో భారత్‌, తైవాన్‌ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్నాం. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత, ఇతర రంగాలపై ఇరు దేశాల సహకారం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని లాయ్‌ రాసుకొచ్చారు.

* ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైకాపాలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రస్తుతం ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం మూసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తాడేపల్లిలోని జగన్‌ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి పార్టీ కార్యాలయం మార్చాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనం వైకాపా కేంద్ర కార్యాలయంగా మారనుంది. జూన్‌ 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని జగన్‌ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కంప్యూటర్లు, ఇతర సామగ్రి తరలింపునకు వైకాపా శ్రేణులు సిద్ధం చేస్తున్నాయి.

* స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి త్వరలోనే ‘మహారాజ’తో (ంఅహరజ ంఒవిఎ) అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ కృతిశెట్టి (ఖ్రిథి షెత్త్య్) గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో సినిమాలను తిరస్కరించడానికి గల కారణాన్ని వివరించారు. ‘‘నేను నటించిన ‘డీఎస్పీ’ సినిమాలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయలేనని చెప్పా. దానికి కారణం ‘ఉప్పెన’లో ఆమెకు తండ్రిగా నటించాను. అది మంచి విజయాన్ని సాధించింది. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేను. అందుకే వద్దు అని చిత్రబృందంకు చెప్పాను.

* లోక్‌సభ ఎన్నికల్లో దేశంతోపాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్‌సభ ఎన్నికలు నిజాయతీగా జరిగాయి. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పని చేయలేదు.

* ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబుకు గురువారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

* ఈనెల 11న టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఎన్నుకుని గవర్నర్‌కు నివేదిక పంపుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12న ఉంటుందని వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. మోదీ, ఒడిశా సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమాలకు చంద్రబాబు వెళ్తారని తెలిపారు. ఓటమి చూశాక కూడా జగన్‌ తీరు మారలేదని విమర్శించారు. అసహనంతో తెలుగుదేశం శ్రేణులపై దాడుల్ని ప్రేరేపిస్తూ.. తామేదో దాడులు చేస్తున్నట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.

* విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేస్తారని నిఘా వర్గాల సమాచారం రావడంతో భద్రతను పెంచారు. ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ బయటకు తీసుకెళ్లకుండా కాపలా కాస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z