బంగ్లాదేశ్‌లోని బారిసల్‌లో ఏడాది క్రితం 9 మేకల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇటీవల వాటిని విడుదల చేసారు. అంత కఠిన శిక్ష పడటానికి ఆ మేకలు చేసిన తప్పేంటో తెలుసా? చదవండి.బారిసల్ నగరంలోని ఓ శ్మశాన వాటికిలోకి చొరబడిన 9 మేకలు గడ్డి మేసాయట. అంతే బారిసల్ సిటీ కార్పొరేషన్ వాటిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. గతేడాది డిసెంబర్ 6 న ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వాటి యజమాని షచిబ్ రాజిబ్ ఎంత గగ్గోలు పెట్టినా విడిచిపెట్టలేదు. అప్పటి బిసిసి అడ్మినిస్ట్రేటివ్ అధికారి స్వపోన్ కుమార్ దాస్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఇటీవల మేకల యజమాని షచిబ్ రాజిబ్ బిసిసి మేయర్‌కి వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడంతో వాటిని డిసెంబర్ 8 న విడుదల చేసారు. మేకలను యజమానికి అప్పగించే సమయంలో ప్రస్తుత బిసిసి అడ్మినిస్ట్రేటివ్ అధికారి అలంగీర్ హుసేన్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. బయట స్వేచ్చగా తిరుగుతూ గడ్డి మేయాల్సిన మూగజీవాలు ఏడాది పాటు జైల్లో గడ్డి మేయడం వింతగా ఉంది.
👉 – Please join our whatsapp channel here –