1.సభలో నాగరికత తో ప్రవర్తించండి : వై.ఎస్ జగన్
సభలో వరుసగా రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ నినాదాలు చేయడంతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. టీడీపీ సభ్యులకు మీ ద్వారా వినమ్రంగా కూడా విన్నవిస్తున్నాను. దయచేసి నాగరికతతో (సివిలైజ్డ్‌గా) ప్రవర్తించండి. సభను జరిపించకూడదు అన్న ఆలోచన పక్కన పెట్టండి. లాజిక్‌గా కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు ప్రస్తావిస్తున్న వాటిపై నేను కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నాను. ఎవరైనా సారా కాసేవారు, 55 వేల జనాభా ఉంటున్న జంగారెడ్డిగూడెంలో సారా కాయగలరా? పైగా అది ఒక మున్సిపాలిటీ. అక్కడ 2011 లెక్కల ప్రకారం 44 వేల జనాభా ఉంది. ఇప్పుడు అక్కడ దాదాపు 55 వేల జనాభా ఉంది. అక్కడే పోలీస్ స్టేషన్, వార్డు సచివాలయాలు ఉన్నాయి. మహిళా పోలీస్‌లు కూడా ఉన్నారు. వాళ్లందరి కళ్లు గప్పి సారా కాయడం సాధ్యమా? ఎక్కడో మారుమూల గ్రామంలో, నిర్జన ప్రదేశంలో సారా కాస్తున్నారంటే నమ్మొచ్చు. అంతేకానీ జంగారెడ్డిగూడెం వంటి పట్టణంలో సారా కాయడం సాధ్యమాసారా కాసే వారికి మేము అండగా నిల్చే ప్రసక్తే లేదు. పైగా వారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. మేం వచ్చాక ఎస్‌ఈబీ ఏర్పాటు చేసి, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. అక్రమ మద్యానికి సంబంధించి ఇప్పటికే 13 వేల కేసులు నమోదు చేశామంటే, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది అర్ధం అవుతుంది.ఇక చంద్రబాబు ప్రకటన చూస్తే.. ఆశ్చర్యం కలుగుతోందిఆయన ఏమంటాడంటే.. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అప్పు తేవడంతో పాటు, మరో రూ.25 వేల కోట్లు అప్పుకు సిద్ధం అవుతున్నామని, మరోవైపు మద్యం విక్రయాలు బాగా పెంచి, ఇంకా ఆదాయం పొందాలని చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. మరి ఆయన ఆ మాట అంటూనే, మరో మాట ఏమంటాడు. సారా తాగి మనుషులు చనిపోయారంటున్నాడు. అంటే తాను అన్న మాటలను తానే విభేదించాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. ఒక మాటకు, రెండో మాటకు పొంతన ఉండడం లేదు.మద్యం అమ్మకాలు పెంచుతున్నామని అంటూనే, జనం సారా తాగుతున్నారని మరోవైపు విమర్శిస్తున్నాడు. అసలు సారా తాగిస్తే, ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా? అంటే కనీస కామన్‌సెన్స్ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.ప్రతి గ్రామంలో 90 సహజ మరణాలుంటాయని సీఎం అన్నారని ఈనాడులో వ్యంగ్యంగా రాశారు. జంగారెడ్డిగూడెంలో 55 వేల జనాభా ఉంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 44 వేల జనాభా ఉంది. 10 ఏళ్ల తర్వాత 12 శాతం పెరుగుదలతో ఇవాళ అక్కడ 55 వేల జనాభా ఉందని చెబుతున్నాం.అదే విధంగా ఇవాళ దేశంలో 2 శాతం మరణాల రేటు ఉంది. ఇది నేను చెబుతున్నది కాదు. రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఆ మరణాలు వృద్ధ్యాప్యంవల్ల కావొచ్చు. అనారోగ్యంతో కావొచ్చు. లేదా మరే ప్రమాదం వల్ల అయినా కావొచ్చు. ఆ మేరకు 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 2 శాతం సగటు తీసుకుంటే, ఏటా దాదాపు 1000 మంది చనిపోతున్నారు. అంటే నెలకు దాదాపు 90 మంది చనిపోతున్నట్లు అవుతుంది. దాన్ని బట్టే నేను ఆ విషయాన్ని ప్రస్తావించాను. కానీ ఈనాడు పత్రిక దాన్ని కూడా వక్రీకించి రాసింది.నిజానికి జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే చోట, ఒకే రోజు జరగలేదు. వేర్వేరు చోట్ల, ఒక వారం రోజుల్లో ఆ మరణాలు చోటు చేసుకున్నాయి. నిజానికి మరణించిన వారి అంత్యక్రియలు కూడా జరిగాయి. అప్పుడు ఏం గొడవలు జరగలేదు. ఒకచోట ప్రభుత్వమే చొరవ చూపి, పాతిపెట్టిన ఒక భౌతిక కాయానికి పోస్టుమార్టమ్ నిర్వహించింది.ఒకవేళ నిజంగానే అది సారా మరణం అయితే, ప్రభుత్వం ఆ విధంగా పోస్టుమార్టమ్ నిర్వహిస్తుందా?వారి మనస్తత్వం, ఆలోచన ఒక్కటే. ఒక అబద్ధం తీసుకురావాలి. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఢంకా భజాయించాలి. ఆ విధంగా గోబెల్ ప్రచారం చేయాలి. అంటే ఒకే అబద్ధాన్ని 100సార్లు చెబితే, ప్రజలు నమ్ముతారని వారి నమ్మకం. అందుకే ముందు ఒకరు అందుకుంటారు. ఆ వెంటనే మిగిలిన వారు, చంద్రబాబు పదే పదే అదే చెబుతారు, కేవలం మీడియా, వాటి యాజమాన్యాలు, చంద్రబాబు.. అందరూ కలిసి వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. ఏమీ జరగని దాన్ని జరిగినట్లు చూపే విష ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి మంచి చేయడానికి అక్కడ కూర్చుని సలహాలు ఇవ్వండి. స్వీకరిస్తాం. అంతే తప్ప ఇలా ప్రవర్తించి, కార్యక్రమాలు అడ్డుకోవద్దు.
బడ్జెట్ చర్చల్లో పాలు పంచుకోండి. సలహాలు ఇస్తే నోట్ చేసుకుంటాం. కాబట్టి పద్ధతి మార్చుకోండి.
లేదు. ఇలాగే ఉంటాం అంటే మీ ఇష్టం. ఇప్పుడు ఒక రూల్ ప్రస్తావించారు. దాని ప్రకారం మీరు సస్పెండ్ అవుతామంటే మీ ఇష్టం.. అని ముఖ్యమంత్రి అన్నారు.
2.ఏపీ అసెంబ్లీలో రెండో రోజు టీడీపీ నిరసనలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభలో రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ జరపాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలంటూ తెలుగు దేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ సభ్యులు ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
3.అసెంబ్లీ లో ఇక కొత్త రూల్.. ఇకపై గీత దాటితే సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ వచ్చేసింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం సరికొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్‌గా సస్పెండ్ అయ్యే రూలింగ్‌ను తీసుకువస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్‌ను దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతే కాకుండా సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్‌కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. కాగా ఈ మధ్య అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.*
4.ఉగాది రోజు ఏపీ కేబినెట్ పునర్వ్యసవస్థీకరణ. అదేరోజు ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త మంత్రులు. మార్చి 27న పాత మంత్రివర్గం రాజీనామా. మళ్లీ ఐదుగురు డిప్యూటీ సీఎంలు. మహిళకే మళ్లీ హోంమంత్రి పదవి వరించే అవకాశం. బీసీ, ఎస్సీ సమీకరణాలు, మహళ కోటా యథాతదం
5.సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ మోషేను రాజు
టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని, ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ : శాసనమండలిలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు.
6.టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవు : మంత్రి బొత్స సత్యనారాయణ
టీడీపీకి ప్రజా సమస్యలు పట్టవని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
7.సున్నా వడ్డీ పథకం ద్వారా 88,00, 626 సభ్యులకు లబ్ది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 98,00, 626 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి(2019-20, 21-22) 9,41,088 సంఘాల్లోని 88,00,626 సభ్యుల కోసం 2354 కోట్ల 22 లక్షలను రెండు విడతల్లో ఖర్చు చేసినట్లు తెలిపారు.
8.వృత్తిపరమైన వర్గాలను ఆర్థికంగా ఆదుకున్నాం : చెల్లు బోయిన వేణు గోపాల కృష్ణ
వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాల ద్వారా వెనుకబడిన తరగతులవారికి ఆర్థిక సాయం చేస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు వృత్తిపరమైన వర్గాలకు చెందిన సుమారు 11 లక్షల 73 వేల 18 మంది లబ్దిదారులకు 2,272.31 కోట్ల రూపాయలు వినియోగించామని తెలిపారు.
8.బీసీలకు నవరత్నాల కింద ఆర్థిక సాయం : వెనుకడిన తరగతులు, చేతివృత్తులవారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నవరత్నాల కింద వివిధ ఆర్థిక సహాయ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.
9.ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు : మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్
పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటివద్దే ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు అండగా ప్రభుత్వం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
1౦.టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలే : మంత్రి బుగ్గన
ప్రశ్నలకు సమాధానాలు వినే ఓపిక కూడా టీడీపీ సభ్యులకు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్షం లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్నీ వెన్నుపోటు పథకాలేనని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు.విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం శ్రీ వైయస్.జగన్‌ను ఆహ్వానించిన దేవాదాయశాఖ మంత్రి, టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, ఇతర అధికారులు.
11.ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలు అందించిన వేద పండితులు.*
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ఉండాలి 55వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా..? అక్రమ మద్యాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ తెచ్చాం నిఘా ఎక్కువుగా ఉన్న చోట సారా కాయడం సాధ్యమా..? ఏదైనా మారుమూల ప్రాంతాల్లో నాటు సారా కాస్తారంటే నమ్మొచ్చుసారా కాసే వారి మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. చంద్రబాబు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారు. నాటు సారా కాసేవారిపై రెండేళ్లలో 13 వేల కేసులు పెట్టాం. జరగని ఘటనను జరిగినట్లు చూపించే ప్రయత్నం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు విష ప్రచారం. ప్రజాస్వామ్యాన్ని చంపే కుట్ర జరుగుతోంది. ప్రతిపక్షం సలహాలు ఇవ్వండి..మేం నోట్ చేసుకుంటాం- అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్.
12. AP Assemblyలో కొత్త రూల్.. ఇకపై గీత దాటారో..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ వచ్చేసింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం సరికొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్‌గా సస్పెండ్ అయ్యే రూలింగ్‌ను తీసుకువస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్‌ను దాటితే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతేకాదు.. సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్‌కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. కాగా.. ఈ మధ్య అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.