సునీతకు లండన్ ఎన్నారైల సంఘీభావం

Featured Image

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు(కారు గుర్తు) ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని లండన్ ఎన్నారైలు కోరారు. ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాల్నా? బుల్డోజర్ రావాల్నా? జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచించుకోవాలని ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.

కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్‌ నుండే మొదలైందని..హైడ్రాతో హైదరాబాద్ బ్రాండ్‌ను నాశనం చేశారని, సామాన్య పేద ప్రజలకు ఇల్లు లేకుండా రోడ్డున పడేశారని, ప్రజలంతా ఓటు ద్వారా కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే మైనారిటీ నాయకుడు అబ్దుల్ జాఫర్ మాట్లాడుతూ...కెసిఆర్ నాయకత్వంలోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరిగిందని, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మైనారిటీలని గౌరవించి అభివృద్ధి చేసిందని తెలిపారు.

ఎన్నారై బీ.ఆర్.యస్ ఉపాధ్యక్షుడు హరి నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవికుమార్ రేటినేని, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శులు మల్లారెడ్డి, సురేష్ గోపతి, రవిప్రదీప్ పులుసు, నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, ప్రశాంత్ మామిడాల, అంజన్ రావు, తరుణ్ లునావత్, షేక్ ఇమాం గౌస్, హరి కృష్ణ మామిళ్ళ, మొహ్మద్ అబ్దుల్ ఖుదూస్, దయాల వసంత్ కుమార్ , మహేందర్ పడిగెల, శ్యామ్ రెడ్డి సరికొండ, నాగరాజు, అజయ్ రావు, హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్, సాయి కిరణ్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags-London NRIs Support Jubilee Hills BRS Candidate Maganti Suneetha

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles