🕑 Published: November 22, 2026 at 08:25 AM CST
నవలా రచయితలకు సాదర విజ్ఞప్తి – గడువు సమీపిస్తోంది!
ప్రియమైన తెలుగు సాహిత్యాభిమానులకు, నవలా రచయితలకు నమస్కారం!
మా తల్లిదండ్రులు స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మ గార్ల స్మారకంగా, సిరికోన సాహితీ అకాడెమీ తరపున 2021 సంవత్సరం నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్న సిరికోన నవలల పోటీ – 2026 గురించి మరోసారి మీకు వినమ్రంగా గుర్తుచేస్తున్నాము. 🙏ఈ సంవత్సరం ప్రకటించిన ఇతివృత్తం:
"మానవ సంబంధాలపట్ల యువతలో అనాసక్తి – మారుతున్న సామాజిక, కుటుంబ విలువలు"
ఈ పోటీలో పాల్గొనదలచిన ఔత్సాహిక, అనుభవజ్ఞులైన నవలా రచయితలందరూ తమ సృజనాత్మకతను జోడించి, నాణ్యమైన నవలలను సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము.
🏆 ఉత్తమ నవలకు రూ. 40,000 నగదు పురస్కారం!
అర్హమైన ఇతర నవలలకు కూడా యథోచిత ప్రత్యేక బహుమతులు అందజేయబడతాయి.
📌 ముఖ్యమైన గమనిక:
నవలల సమర్పణకు చివరి తేదీ డిసెంబర్ 31, 2026 (గురువారం).
గడువు సమీపిస్తున్నందున, పోటీలో పాల్గొనాలనుకునే రచయితలు తమ నవలలను చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా, నిర్ణీత గడువులోగా సమర్పించవలసిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.
పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు, నవలల సమర్పణ విధానం, అర్హతలు మరియు పాటించవలసిన నియమ నిబంధనలతో కూడిన ఇంతకుముందు విడుదల చేసిన ప్రకటన మరియు నియమావళిని ఈ సందేశంతో పాటు జతపరుస్తున్నాము. దయచేసి వాటిని మరోసారి పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా మీ రచనలను పంపగలరు.
రండి... మంచి నవలలను ప్రోత్సహిద్దాం! ప్రతిభావంతులైన రచయితలను వెలుగులోకి తీసుకువద్దాం!! తెలుగు సాహితీ వైభవాన్ని మరింత
ఇనుమడింపజేద్దాం!


