🕑 Published: November 22, 2026 at 08:35 AM CST
ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, ఆచారాలు, భక్తి భావాలు, కుటుంబ విలువలను తదుపరి తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సమాఖ్య వ్యవస్థాపకురాలు పీసపాటి జయ తెలిపారు. హ్యాపీ వ్యాలీ హిందూ దేవాలయంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో దంపతులు సామూహికంగా పాల్గొన్నారు. దత పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులకు ప్రసాదం, భోజనాలను అందజేశారు. రచయిత్రి రాధికా మంగిపూడి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మన్నే, హరీన్ తుమ్మల, రాధాదేవి సారంగ సహకరించారు.







