DailyDose

నింగిలోకి పీఎస్‌ఎల్‌వీసీ45–తాజావార్తలు–04/01

నింగిలోకి పీఎస్‌ఎల్‌వీసీ45–తాజావార్తలు–04/01

*భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-45 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం 9.27 గంటలకు ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహక నౌక డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌ను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో పాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను ఇది నింగిలోకి మోసుకెళ్లింది.
*తిరుపతి గ్రామీణ మండలం పద్మావతిపురంలో నివాసం ఉంటున్న వైకాపా నేత గణపతినాయడు ఇంటిపై సోమవారం వేకువజామున పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధంగా ఉంచిన గోడ గడియారాలు, చీరలు పోలీసులకు పట్టుబడ్డాయి. ముందుగా అందిన రహస్య సమాచారం మేరకు తిరుచానూరు సీఐ అశోక్ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు వైకాపా నేత ఇంటిపై దాడులు నిర్వహించారు. ఓ గదిలో భారీగా భద్రపరచిన గోడగడియారాలు, చీరలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో సినీ నటులు రాజశేఖర్‌ఆయన భార్యజీవితనటి హేమశ్యామలఆమె భర్త నర్సింహారెడ్డి వైసీపీలో చేరారు. వీరందరికి జగన్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
*పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీఎస్పీ, జనసేన పార్టీ సంయుక్తంగా హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలయ్య, జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జి, ఆపార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి నేమూరి శంకర్‌గౌడ్‌ తెలిపారు. ఈ నెల 4న నిర్వహించనున్న సభకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హాజరవుతారని వెల్లడించారు. తెలంగాణలో తమ రెండు పార్టీలు కలిసి 12 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని, భవిష్యత్తులోనూ తమ పొత్తు కొనసాగుతుందన్నారు.
*భారత్‌లో పాకిస్థాన్‌ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సొహెయిల్‌ మహ్మద్‌ పాక్‌ విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జాంజువా ఏప్రిల్‌ 16న పదవీ విరమణ పొందుతున్నారు. సొహెయిల్‌ స్థానంలో భారత్‌లో హైకమిషనర్‌గా ఎవరు నియమితులవుతారన్నది ఇంకా వెల్లడి కాలేదు.
*భారత్‌లో పాకిస్థాన్‌ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సొహెయిల్‌ మహ్మద్‌ పాక్‌ విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జాంజువా ఏప్రిల్‌ 16న పదవీ విరమణ పొందుతున్నారు. సొహెయిల్‌ స్థానంలో భారత్‌లో హైకమిషనర్‌గా ఎవరు నియమితులవుతారన్నది ఇంకా వెల్లడి కాలేదు.
*జమ్మూ కశ్మీర్‌లో ‘మానవ కవచం’ వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న సైనికాధికారి మేజర్‌ లీతుల్‌ గొగొయిపై చర్యకు రంగం సిద్ధమైంది. గత ఏడాది శ్రీనగర్‌లో స్థానిక యువతితో కలసి ఆయన హోటల్‌కు వెళ్లిన ఘటనపై ఏర్పాటైన ‘కోర్టు మార్షల్‌’ తన విచారణను ముగిసిపోయింది.
* బ్రిటీషు పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని.. కొందరు మోసగాళ్లు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లోని అల్‌ఖైదాకు విరాళాలుగా దోచిపెట్టారని వెల్లడైంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు హాంకాంగ్‌, దుబాయ్‌లకు తరలించారని తేలింది.
*జాతీయ భద్రతపై రూపొందించిన ఒక సమగ్ర నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌కు పదవీవిరమణ చేసిన లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా సమర్పించారు. 2016లో జరిగిన మెరుపుదాడులకు ఆయన వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం విదితమే.
*ఆన్‌లైన్‌ కొనుగోలుదారులను రూ.200 కోట్ల వరకు మోసం చేసిన గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారి నందన్‌రావ్‌ పటేల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్టీఎఫ్‌) అరెస్టు చేసింది. 14 లక్షలమంది వినియోగదారుల వివరాలను ఇతడి గ్యాంగ్‌ అక్రమంగా, చట్టవిరుద్ధంగా సేకరించిందని ఎస్టీఎఫ్‌ డీఎస్పీ రాజ్‌కుమార్‌మిశ్ర తెలిపారు. ‘‘తెలిసినవారి ద్వారా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తదితర ఆన్‌లైన్‌ ఇకామర్స్‌ వెబ్‌సైట్ల వినియోగదారుల వివరాలతో పాటు బీమా కంపెనీల నుంచి ఖాతాదారుల వివరాలు రూ.2-3కు చొప్పున కొనుగోలు చేసేవాడు. వాటిని రూ.5-6లకు నకిలీ కాల్‌సెంటర్లకు అమ్మేవాడు. దిల్లీ-ఎన్‌సీఆర్‌, బిహార్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లోని ఈ కాల్‌సెంటర్లు లక్షలాదిమందిని రూ.కోట్లలో మోసం చేశాయి’’ అని మిశ్ర తెలిపారు.
*ఆన్‌లైన్‌ కొనుగోలుదారులను రూ.200 కోట్ల వరకు మోసం చేసిన గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారి నందన్‌రావ్‌ పటేల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్టీఎఫ్‌) అరెస్టు చేసింది. 14 లక్షలమంది వినియోగదారుల వివరాలను ఇతడి గ్యాంగ్‌ అక్రమంగా, చట్టవిరుద్ధంగా సేకరించిందని ఎస్టీఎఫ్‌ డీఎస్పీ రాజ్‌కుమార్‌మిశ్ర తెలిపారు
*అంతర్జాలాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల గోప్యతకు పెద్దపీట వేసిన ఐరోపా సమాఖ్య తరహా నిబంధనలను మిగతా దేశాలు కూడా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
*వేసవి రద్దీ మొదలవుతున్న సమయంలో విశాఖ నుంచి నిత్యం నడుస్తున్న పలు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కోల్‌కతా-విశాఖ (సర్వీసు నెంబరు 6ఈ833), విశాఖ-కోల్‌కతా (6ఈ886), బెంగళూరు-విశాఖ (6ఈ622), విశాఖ-బెంగళూరు (6ఈ647) సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. చెన్నై నుంచి విశాఖ, భువనేశ్వర్‌ మీదుగా కోల్‌కతాకు వెళ్లాల్సిన సర్వీసు (6ఈ557)ను భువనేశ్వర్‌లో ఆగకుండా నేరుగా కోల్‌కతా వెళ్తుంది. దీంతో విశాఖ – భువనేశ్వర్‌ సేవలు ఆగిపోయాయి. తిరుగు ప్రయాణంలోనూ (6ఈ512) నేరుగా కోల్‌కతా నుంచి విశాఖకు వచ్చేలా చేశారు. వేసవి రద్దీ నేపథ్యంలో మరిన్ని సర్వీసులను పెంచడానికి బదులు ఉన్నవాటినే రద్దు చేయడం ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపనుంది..
*దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ హాలులో ‘సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు ఆవశ్యకత-దక్షిణ భారతదేశానికి సామాజిక న్యాయం’ అనే అంశంపై దక్షిణ భారతదేశ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య గాలి వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు.
*రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ (ఏప్రిల్‌ 5), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ (ఏప్రిల్‌ 14) జయంతి ఉత్సవాలు జరుగుతాయని ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లాకు రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాలను రాజకీయాలకు వేదికగా వాడుకోకూడదని, రాజకీయ ప్రచారం చేయకూడదని వివరించారు.
*మహిళల సామర్థ్యానికి ఆకాశమే హద్దని, వారిని తక్కువ అంచనా వేయవద్దని అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో దూసుకుపోతారని ఏషియన్‌ అరబ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ ప్రిన్సెస్‌ ఫే జహన్‌ అరా అన్నారు.
*అఖిల భారత షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంస్థకు జాతీయస్థాయి అధ్యక్షుడిగా రాగాల నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
*మైనార్టీ సంక్షేమశాఖలో ప్రభుత్వం కీలకమార్పులు చేసింది. గత ఎనిమిదేళ్లుగా మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ ఎస్‌.ఏ. షుకూర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే మైనార్టీ స్టడీసర్కిల్‌ను ఆయన పరిధి నుంచి తీసివేసింది.
*చిన్ననీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీరు శ్యాంసుందర్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. కృష్ణా, గోదావరి పరీవాహకాలకు ఇద్దరు సీఈలు ఉండాల్సి ఉండగా ఆయనే రెండు బాధ్యతలను ఇన్నాళ్లూ నిర్వర్తించారు. ఆయన పదవీ విరమణ పొందడంతో కృష్ణా పరీవాహకం సీఈగా హమీద్‌ఖాన్‌ను నియమించారు. నీటిపారుదల శా
*మైనార్టీ సంక్షేమశాఖలో ప్రభుత్వం కీలకమార్పులు చేసింది. గత ఎనిమిదేళ్లుగా మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ ఎస్‌.ఏ. షుకూర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే మైనార్టీ స్టడీసర్కిల్‌ను ఆయన పరిధి నుంచి తీసివేసింది.
*ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలను పెంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
*ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఆదివారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో సందడి చేశారు. ఆయన సోదరుడు పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఇక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైకాపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు పూరీ జగన్నాథ్‌తో కలిసి ఫొటోలు తీయించుకున్నారు. తన దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న రామ్‌ హీరోగా ఐస్మార్ట్‌ శంకర్‌, తన కుమారుడు ఆకాశ్‌ హీరోగా నిర్మిస్తున్న రొమాంటిక్‌ చిత్రాలు త్వరలోనే విడుదలవుతాయని ఆయన వివరించారు.
*ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రత్యేక పోలీసు పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న కేకే.శర్మ భద్రత, బందోబస్తు తదితర అంశాలపై ఆదివారం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది పోలీసు సిబ్బంది అవసరం? ఇప్పటివరకూ ఎంతమంది వచ్చారు? ఇంకా ఎంత మంది కావాలి? తదితర అంశాలపై ఆరా తీశారు.
*మహిళల సామర్థ్యానికి ఆకాశమే హద్దని, వారిని తక్కువ అంచనా వేయవద్దని అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో దూసుకుపోతారని ఏషియన్‌ అరబ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ ప్రిన్సెస్‌ ఫే జహన్‌ అరా అన్నారు.
*రెవెన్యూ శాఖపై, ఇందులో పని చేస్తున్న ఉద్యోగులపై విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయని వాటికి అసలు ఆస్కారమే లేకుండా చేసేందుకు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరాయి. 30 నుంచి 45 రోజుల గడువిస్తే రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని భూసమస్యలు లేని పల్లెగా మారుస్తామని పేర్కొన్నాయి.
*రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిర్మల్‌ జిల్లా పెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, నిర్మల్‌ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.