DailyDose

ఏకంగా 42 కేసులు–నేరవార్తలు–04/02

cases on revanth reddy

* లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్ల సమర్పణలో భాగంగా అందజేసిన అఫిడవిట్ల ప్రకారం గ్రేటర్ పరిధిలోని పార్టీలలో నేర చరిత్ర కలిగిన క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థులపై కేసులున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలలో బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులలో చేవెళ్ల బరిలో నిలిచిన ఏ ఒక్క అభ్యర్థిపై కూడా ఎలాంటి కేసులు లేవు. ప్రధానంగా.. మాల్కాజిగిరి లోకసభ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోఉన్న రేవంత్రెడ్డిపై 42 కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ బరిలో నిలిచి నఅభ్యర్థు ల కేసులలో ఈయన రెండో వ్యక్తి గానిలవడం గమనార్హం.
* ఏపీ డీజీపీకి షాక్
ఏపీ రాజకీయాలుసంచలనంగా మారాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీ పైనా కంప్లయింట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం దానిపై విచారణ జరిపింది. డీజీపీ ట్రాక్ రికార్డ్ బాగుందని.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏపీ డీజీపీ వాహనాన్నే తనిఖీ చేయడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎస్ కోట మండలం బొడ్డవరం జంక్షన్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. అదే మార్గంలో అరకు వెళ్తున్న ఏపీ డీజీపీ వాహనాన్ని ఆపారు. ఆయన వెహికల్ ను కూడా తనిఖీ చేశారు. దీంతో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్.. ఏపీ డీజీపీకే షాక్ ఇచ్చినట్లయింది. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది.
* సీనియర్ నటుడు మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష
సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు తీర్పునిచ్చింది. చెక్‌బౌన్స్‌ కేసులో మోహన్‌బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించినది. 2010లో చెక్‌బౌన్స్‌ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది. రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్ట్‌కు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. కాగా ఇందుకు సంబంధించి మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు.
*పోలీసులపై చేయి చేసుకున్న నటిపై కేసు
తాగిన మత్తులో ముంబైలోని బాంద్రాలో పోలీసు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన టీవీ నటి, మోడల్‌ రుహి సింగ్‌పై కేసు నమోదు చేశారు. స్నేహితులతో కలిసి రుహి సింగ్‌ పబ్‌ నుంచి తిరిగివస్తూ బాంద్రాలోని ఓ మాల్‌వద్ద ఆగారు. మాల్‌ సిబ్బందితో గొడవకు దిగడంతో వారు పోలీసులకు ఫోన్‌ చేశారు. ఖర్‌ పోలీస్‌ స్టేసన్‌ నుంచి అక్కడికి చేరుకున్న పోలీసులతో సైతం రుహి సింగ్‌ బృందం వాగ్వాదానికి దిగింది.
* ఓ వివాహిత హత్యకు గురైన సంఘటన సోమవారం మండలంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం..మండలంలోని రేణుమాకులపల్లె పంచాయతీ దండువారిపల్లెకు చెందిన విశ్వనాథ్‌(34)కు పలమనేరు నియోజకవర్గంలోని ధర్మపురికి చెందిన వాణి(30)తో వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె హేమలత ఉంది. ప్రస్తుతం వాణి ఆరు మాసాల గర్భవతి. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.
* ఇందూరులో జరిగిన భాజపా బహిరంగ సభలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కమల విజయభేరి పేరుతో నిర్వహించిన సభా వేదిక పక్కనే షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటలు సంభవించిన ప్రదేశంలో ప్రమాదానికి కొన్ని గంటల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వాహనం నిలిపి ఉంచారు. సిబ్బంది అప్రమత్తతో తృటిలో ప్రమాదం తప్పింది.
* ప్లాస్టిక్ వాటర్‌ట్యాంక్ ప్రమాదవశాత్తు మీద పడిన ఘటనలో ఇద్దరు సోదరులు మృతి చెందారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రంలోని బీడ్ జిల్లాలో జరిగింది. ఛించన్ గ్రామంలో ఓ ఎడ్లబండిపై వాటర్‌ట్యాంక్‌ను పెట్టి ఉంచారు. ఇద్దరు సోదరులు జైదేవ్ బాజీరావు రాథోడ్ (అవిష్కర్ (ఎడ్లబండిపై నిలబడి ఆడుకుంటుండగా..బండి బ్యాలెన్స్ తప్పి ఒకవైపు ఒరిగింది. దీంతో ఎడ్లబండిపై ఉన్న వాటర్‌ట్యాంక్ ఇద్దరిపై పడింది. స్థానికులు చిన్నారులను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత ఉండటంతో అక్కడి ప్రజలు చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి వాటర్‌ట్యాంక్‌లో నీటిని తీసుకెళ్తుంటారు.
* శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. అయితే దీన్ని అంగడి సరుకుగా మార్చేసారు కొందరు కేటుగాళ్లు. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీల బిజినెస్‌ చేస్తున్నారు. అయితే కిడ్నీ ఇచ్చినా, ఒప్పందం ప్రకారం డబ్బులివ్వకపోవడంతో ఓ బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. వారి తీగలాగడంతో ఈ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టయింది.
* బెజవాడలో పట్టుబడ్డ భారీ డెకాయిటి ఆపరేషన్టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో హైదరాబాద్ కి చెందిన వ్యాపారికి సంబంధించిన కోటి 70 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు… హవాలా లేదా మనీలాండరింగ్ డబ్బుగా భావిస్తున్న పోలీసులు.. కోటి 26 లక్షలు రికవరీ… ఐదుగురు అరెస్ట్…పోలీస్ కమినర్ ద్వారకాతిరుమలరావు కామెంట్స్హైదరాబాద్ కి చెందిన అభినవ్ రెడ్డి అనే వ్యాపారికి చెందిన నగదు విజయవాడలో వసూలు చేసి హైదరబాద్ కు అభినవ్ రెడ్డి వద్ద పనిచేస్తున్న నాగరాజు చేరవేస్తున్నాడు..ఈ డబ్బుకి ఎటువంటి లెక్కలేదు…నాగరాజు స్నేహితుడు నాని కలిసి డబ్బులు వసూలు చేసి హైదరాబాద్ కి పంపేవారు..లెక్కల్లో లేని డబ్బు కాబట్టి నాని ఆ డబ్బంతా కొట్టేద్దామని ప్లాన్ చేశాడు..కొందరు స్నేహితులతో కలిసి నాగరాజుకి తెలియకుంటా డెకాయిట్ ఆపరెషన్ చేశాడు..టాస్క్ ఫోర్స్ పొలీసులమని చెప్పి డబ్బుతో ఓ హోటల్ కి వెళుతున్న సమయంలో అడ్డగించి డబ్బు పట్టుకెళ్లారు..హోటల్ దాచిన మరో 40 లక్షలు నాని బయటకి తీసుకెళుతున్న సమయంలో నాగరాజు అడగ్గా ..ఎలాగో డబ్బు పోయింది ఉన్న 40 లక్షలు మనమే పంచుకుందాని నాగరాజుని ఒప్పించారు…వ్యాపారి అభినవ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేశాం..ఆ డబ్బు గురించి వ్యాపారి అభినవ్ రకరకాల వివరాలు చెబుతున్నాడు..డబ్బుకు లెక్కలేదని గుర్తించాం..ఈడీకి ,ఐటి కి సమాచారం ఇచ్చాం..వ్యాపారి ఆ డబ్బు ముంబైకి తరలిస్తున్నాడు…మనీలాండరింగా, హవాలానా అఅని విచారణ చేస్తున్నాంఎలక్షన్ కోసం ఈ డబ్బంతా తెచ్చారా అనే కోణం లో విచారణ చేస్తున్నాం…
*డెలివరీ బాయ్ అఘాయిత్యం
జనాలు పుడ్ డెలివరి యప్స్ ఐ అలవాటు పడిపోయారు. అవి అందించే ప్రత్యెక ఆఫర్స్ కు ఆకర్షితులై ఇంట్లో వంట చేసుకోవడం కూడా మానేశారు. భార్యభార్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే మాత్రం రోజుకో డెలివరీ తప్పసినరిగా మారిపోయింది. మనం కోరిన హోటల్ నుంచి మనకు కావాల్సిన ఆహారాన్ని నిమిసహల్లో మన ఇంటి వద్దకు డెలివరి బాయ్స్ తీసుకోచేస్తున్నారు. కానీ పుడ్ డెలివరీ సంస్థల నుంచి కస్టమర్స్ కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎక్కువగా ఆ సంస్థలకు చెందిన దేలివర్స్ బాయ్స్ నుంచి వినియోగదారులు సమస్యలలో చిక్కుకుంటున్నారు. సగం తినేసిన ఆహారాన్ని డెలివరీ చేయడం, లైంగిక దాడులు, అసభ్య ప్రవర్తన లాంటి సమస్యలతో పుడ్ డెలివరీ సంస్థలు అపకీర్తిని మూటగట్టుకుంటున్నాయి.
* నకిలీ, స్పామ్‌ ఖాతాలపై యుద్ధం ప్రకటించిన సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ సోమవారం కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ ఐటీ సెల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న 687 పేజీలు, ఖాతాలు తొలగించింది. వీటిద్వారా పోస్ట్‌ చేస్తున్న సమాచారం, నకిలీవార్తల ఆధారంగా కాకుండా ‘‘సమన్వయంతో కూడిన నిజాయతీలేని ప్రవర్తన, స్పామ్‌ను వ్యాప్తి చేయడం’’ వల్ల తొలగించినట్లు ప్రకటించింది. ఖాతాలను నిర్వహిస్తున్నవారు తమ అసలు ధ్రువీకరణను వెల్లడించడం లేదని, వేరొకరిని తలపించేలా మోసం చేస్తున్నారని పేర్కొంది. s
*ఇటీవలే ప్రారంభించిన నమో టీవీ పై ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ టీవీ చానల్ ను ప్రారంభించేందుకు భాజపా అసలు అనుమతి అడిగిందా? అంటూ ఈసీని ఆప్ ప్రస్నిమ్చింది.ఈ చానల్ పై ప్రధాని మోడీ ఫోటో ఉంటోందని ఆయన ప్రసంగాలని తూచా తప్పకుండా ప్రసారం చేస్తోందని పేర్కొంది. ఇంతకీ, టీవీ ప్రసారాలకు సంబందించిన అంశాలు అందుకయ్యే వ్యయం తదితరాలను ద్రువీకరించే మీడియా సర్టిఫికేట్ కమిటీని భాజపా సంప్రదించింద అని కూడా ఆప్ తన లేఖలో ప్రస్నిమ్చింది.
*చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం పద్మావతిపురంలోని ఓ గోదాంలో దాచి ఉంచిన వైకాపా ఎన్నికల తాయిలాలను సోమవారం తిరుచానూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*మావోయిస్టు పార్టీకి సంబంధించిన మొదటి బెటాలియన్‌ కమాండర్‌ ఇడుమ ప్రధాన అనుచరుడితోపాటు మరో ఇద్దరు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి కొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
*లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు స్వాధీనం (సీజ్‌) చేసిన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువుల విలువ రూ.26,30,32,116 చేరింది.
*ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన మార్చి 11 నుంచి సోమవారం వరకు దేశవ్యాప్తంగా రూ.1460 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా నగదు స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో ఏపీ రూ.94.23 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. మద్యంలో కూడా ఏపీ మూడో స్థానంలో ఉంది.
*ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని అడ్డుకోడానికి తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరేలా కరెన్సీ కట్టలు వెలుగుచూశాయి.
*అమెరికా సంస్థతో 80వేల కోట్ల డాలర్ల ఒప్పందం, భారీ లాభమంటూ దిల్లీకి చెందిన ముగ్గురు ఘరానా నిందితులు హైదరాబాద్‌ వ్యాపారి తారక్‌నాథ్‌ను మోసం చేసి రూ.20కోట్లు స్వాహా చేశారు. ఇందుకోసం ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.
*వాలీబాల్‌ ఆడుకుంటున్న ఇద్దరు యువకులపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కరకవలస గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
*చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ప్రజలను పార్టీల వారీగా విభజించిన నాయకులు.. వారిలో వారే గొడవ పడేలా ఎగదోస్తున్నారు.
*భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఫిబ్రవరి 27న జమ్మూకశ్మీర్‌లోని మన వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ కూలిపోవడానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
*మరో కిడ్నీ రాకెట్‌ బాగోతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. కిడ్నీ కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో సంప్రదింపులు జరిపిన ముఠా సభ్యులు అందుకు ముందుకొచ్చిన వ్యక్తిని బెదిరించి మరీ కిడ్నీ కొట్టేశారు. ఈ ముఠా లీలల్ని రాచకొండ పోలీసులు బహిర్గతం చేశారు.
*ఇంటర్‌ పరీక్షలు రాసిన శ్రవణ్‌కుమార్‌(18), మయూరి(17) అనే ఇద్దరు ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తూ..ఆదివారం ఉదయం రైలుపట్టాల మధ్య విగతజీవులై కనిపించారు. శంషాబాద్‌ పరిధిలోని ఉందానగర్‌- తిమ్మాపూర్‌ స్టేషన్ల మధ్య గల పిల్లోనిగూడ వద్ద.. రైల్వే ట్రాక్‌ పక్కనే వారి కారు నిలిపి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
*భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-27 యుద్ధ విమానం ఆదివారం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ వద్ద కూలిపోయింది. పైలట్‌ పారాచూట్‌ సాయంతో తప్పించుకొని, గాయాలతో బయటపడ్డారు. రోజువారీ విధుల్లో భాగంగా ఈ యుద్ధవిమానం ఉత్తర్‌లాయి వైమానిక స్థావరం నుంచి నింగిలోకి లేచింది. కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో ఉదయం 11.45 గంటలకు జోధ్‌పుర్‌కు దక్షిణాన 120 కి.మీ.ల దూరంలోని సిరోహి జిల్లాలో యుద్ధవిమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు.
*జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దరాల్‌ ప్రాంతంలోని ఉజ్జాన్‌-దండ్‌కోట్‌ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
*విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుల్ని చేయాల్సిన పాఠశాలలే విద్యార్థుల పట్ల కర్కషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా.. ఫీజు కట్టలేదని ఇద్దరు విద్యార్థులను ఎండలో నిలబెట్టిన ఘటన తిరువనంతపురంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. అందులో ఒకరు అంధ విద్యార్థి కావడం గమనార్హం.
*దేశంలో పరువు హత్యలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తన కూతురు ఒక అబ్బాయికి తరచూ చరవాణిలో సందేశాలు పంపుతుందని ఏకంగా కూతురిని చంపేశాడు ఓ కసాయి తండ్రి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
*విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి చినవాల్తేరులో శనివారం సాయంత్రం తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గ్యాస్‌ బెలూన్లు ఎగరవేయడానికి ప్రయత్నించారు.
*యమావళిని ఉల్లంఘించినందుకు చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో మూడు మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. రూ.20 లక్షల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ జవహర్‌బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
*పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. జిల్లా విద్యాధికారులు దీనిని గుర్తించి అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
*తమిళనాట డీఎంకే కోశాధికారి నివాసం, విద్యాసంస్థలు, ఆయన మిత్రుల నివాసాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కొనసాగిన ఐటీ సోదాలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి.
*జర్మనీలోని మ్యూనిక్‌లో ఒక భారతీయ జంటపై ఓ వ్యక్తి కత్తితో పాశవికంగా దాడి చేశాడని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ శనివారం ఇక్కడ చెప్పారు.
*కట్నం తేలేదని ఇంటి కోడలినే కడుపు మాడ్చి చంపిన అత్తింటివారి దురాగతమిది. కొల్లాం సమీపంలోని కరునాగపల్లికి చెందిన తుషార(27)కు అత్తింటివారు గత కొద్దిరోజులుగా భోజనం పెట్టకపోవడంతో నానబెట్టిన బియ్యం, చక్కెర నీటితోనే నెట్టుకొచ్చారు. చివరికి చిక్కిశల్యమై, ఎముకలగూడులా మారి ఈనెల 21న అర్ధరాత్రి అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు.
*లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.24,68,74,298 విలువ గల మద్యం, మాదక ద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం వెల్లడించింది. దాడుల్లో పోలీసు, ఎక్సైజ్‌, ఐటీ శాఖలు పాల్గొన్నాయని శనివారం నివేదికలో పేర్కొంది.
* జమ్మూకశ్మీర్‌లో శనివారం ఒక ప్రైవేటు కారు పేలిపోయి, మంటల్లో చిక్కుకుంది. అదే సమయంలో అటుగా వెళుతున్న సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణిలోని ఒక వాహనం స్వల్పంగా దెబ్బతింది. కారులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోవడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిలో జవహర్‌ సొరంగం వద్ద ఈ ఘటన జరిగింది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు.
వివాహం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన తడకమడ్ల మురళీధర్‌రెడ్డి-సరళ దంపతుల కొడుకు అభిషేక్‌రెడ్డితో నాలుగేళ్ల క్రితం జరిగింది.వేములవాడల సీఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగు మండలం రంగశాయిపల్లి గ్రామానికి చెందిన దొనపాటి రాజిరెడ్డి-వినోద దంపతుల కూతురు జ్యోతిఅత్తింటి వేధింపులతో ఓ యువతి తన మూడేళ్ల కూతురుతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని మూలవాగులో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశాయిపల్లిలో విషాదం నింపింది.