Movies

యాసిడ్‌ దాడి కథతో

deepika acid attack

మానసికంగా, శారీరకంగా గాయపడిన ఓ వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఏ ఫిల్మ్‌మేకర్‌కి అయినా సవాల్‌తో కూడిన పనే. మరి నటించే నాయకానాయికలకు ఇంకెంత సవాల్‌గా ఉంటుంది? అలాంటి సవాల్‌ను ఎదుర్కోనేందుకు బాలీవుడ్‌ పొడుగు కాళ్ల సుందరి దీపికా పడుకోన్‌ సిద్ధమవుతున్నారు. యాసిడ్‌ దాడిలో గాయపడిన లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథతో మేఘనా గుల్జార్‌ ‘ఛపాక్‌’ చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసింది. ఇందులో లక్ష్మీ అగర్వాల్‌ (మాలతి) పాత్ర పోషిస్తున్న దీపికా కథ పాత్రను ఓన్‌ చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టారు. ఆ స్ర్కిప్ట్‌ బుక్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ‘ కైండ్‌ ఎ హోమ్‌వర్క్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘‘బలమైన పాత్ర పోషించాలంటే దానివెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఇలాంటి పాత్రలు పోషించేటప్పుడు చిన్నచిన్న పొరపాటు కూడా జరగకూడదు. ‘పద్మావత్‌, ‘బాజీరావ్‌ మస్తానీ’ సినిమాల కన్నా ‘ఛపాక్‌’లో మాలతి పాత్ర నాకు సవాల్‌ విసిరింది. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా. ఇలాంటి పాత్రలే సమాజానికి స్పూర్తిగా నిలుస్తాయి. ఎప్పటికీ నాతో ఉండిపోయే సినిమా ఇది’’ అని దీపికా పడుకోన్‌ చెప్పుకొచ్చారు.