Business

మన అంబాసిడర్ మళ్లీ వస్తోంది

electric ambassador returns

ఫ్రాన్స్‌కు చెందిన పీఎస్‌ఏ కంపెనీ అంబాసిడర్‌ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిని హిందూస్థాన్‌ మోటార్స్‌ నుంచి కేవలం రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు ఆ కంపెనీతో జేవీ కూడా కుదుర్చుకుంది. రెండు కంపెనీలు కలిసి ఇంజిన్‌ తయారీ విభాగాన్ని తమిళనాడులో ప్రారంభించాయి. భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో అంబాసిడర్‌ మళ్లీ కనిపించనుందా..? అంటే మార్కెట్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. కాకపోతే ఈ సారి బ్రాండ్‌లా వివిధ ఎలక్ట్రానిక్‌ కార్ల రూపంలో ఇది దర్శనమివ్వనుంది. ఫ్రాన్స్‌ కంపెనీ సెట్రోయెన్‌ తన సీ5 ఎయిర్‌ క్రాస్‌ ఎస్‌యూవీలను ఈ పేరుతో ప్రవేశపెట్టనుంది. అంబాసిడర్‌ బ్రాండ్‌నే కేవలం ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయానికి వినియోగించనుంది. ఎలక్ట్రిక్‌ అంబాసిడర్‌ 2022 నాటికి మార్కెట్లోకి రానుంది. భారతీయులకు అంబాసిడర్‌ కారుతో ఉన్న అనుబంధం నేపథ్యంలో భారత్‌లో అడుగుపెట్టేందుకు దానినే ఎన్నుకొంది. దీనిలో డీఎస్‌3 క్రాస్‌బాక్‌ ఈ టెన్స్‌ ఇంజిన్‌ను అమర్చనుంది. తొలుత కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కానీ, క్రాసోవర్‌ వాహనం కానీ మార్కెట్లోకి విడుదల కానుంది.