????????????☘?????????☘???????????????☘????????????
అమెరికాలోని పాఠశాలల్లో విద్యాబోధనకు ఆంధ్రా నుంచి ముప్పై మంది ఉపాద్యాయులు ఎంపికయ్యారు. అభ్యర్ధులకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుసు సంస్థ ఎండీ వేమూరి రవి బుధవారం అర్హత పాత్రలను అందించారు. రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులకు మెరుగైన వేతనం అందించాలన్న లక్ష్యంతో అక్లైమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థతో కలిసి ఏపీ ఎన్.ఆర్.టీ. ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన అర్హత పరీక్షలో రాష్ట్రం నుంచి 128మంది ఎంపిక కాగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఒడిశా పాఠశాల యాజమాన్యం ముఖాముఖి ద్వారా వీరిలో 30 మందిని ఎంపిక చేసింది. అంగ్ల బోధనకు 14 మంది, గణితానికి 12, సైన్స్ కు నలుగురిని ఎంపిక చేశారు. ఐదు సంవత్సరాల ఒప్పందంతో ఏడాదికి రూ.45-50 లక్షలు చొప్పున వీరికి వేతనం లభించనుంది.
టెక్సాస్‌లో పాఠాలు చెప్పనున్న తెలుగు ఉపాధ్యాయులు.
Related tags :