DailyDose

మోడీని చచ్చినా గెలవనీయను–రాజకీయ-04/04

chandrababu says he will not let modi win in 2019

* ఏపీకి ద్రోహం చేసిన మోదీని గెలవనిచ్చేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మేం మీకు బానిసలం కాదు… మా హక్కుల కోసం పోరాడతాం. తెలంగాణ కేసీఆర్‌ ఏనాడూ ఏపీ ప్రజల శ్రేయస్సును కోరుకోలేదు. పోలవరంపై కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌ ఎవరు? భద్రాచలం మునిగిపోతుందని పోలవరాన్ని అడ్డుకుంటున్నారు. భద్రాచలం కూడా మాదే… భద్రాచలాన్ని మేమే తీసుకుంటాం. రాష్ట్రాభివృద్ధి కోసం నేను యజ్ఞం చేస్తున్నాను. రాక్షసుల మాదిరిగా నా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు
* చెంప చెల్లుమనిపిస్తా పీతల సుజాత
చింతలపూడి నియోజకవర్గంలో రూ.1800 కోట్లతో అభివృద్ధి పనులు చేశాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే అంబికా కృష్ణ నాపై అసత్య ఆరోపణలు చేశారు. బుద్ధి ఉన్నోడు ఎవడూ అంత నీచంగా మాట్లాడడు’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అంబికా కృష్ణపై ధ్వజమెత్తారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతల సుజాత హయాంలో అభివృద్ధి జరగలేదని, ఆ పాపం కడిగేసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అభ్యర్థిని మార్చారని జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల క్రితం ఆర్యవైశ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అంబికా కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
* వైసీపీలో చేరిన మాజీ ఎంపీ..
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగి.. ఆ తర్వాత టీడీపీలో చేరి.. సీటు దక్కకపోవడంతో వెంటనే రాజీనామా చేసిన అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అమలాపురం ఎంపీగా పనిచేసిన ఆయన.. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, చంద్రబాబు.. అమలాపురం ఎంపీ స్థానాన్ని బాలయోగి కుమారుడికి ఇచ్చి తనకు హ్యాండ్ ఇవ్వడంతో టీడీపీలో చేరిన రెండో రోజే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఉదయం వైఎస్ జగన్‌ను కలిసిన హర్షకుమార్ తన కుమారుడు శ్రీహర్షతో కలసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు
* వయనాడ్‌లో రాహుల్‌కు వింత పోటీ
వయనాడ్ లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి గెలుపు ధీమాతో ఉన్నారు. కానీ,ఆయనకు అక్కడ ఓ వింత పోటీ ఎదురు కాబోతోంది. ఎక్కువ సార్లు ఎన్నికల్లో నిలిచి ఓడిపోయిన వ్యక్తి ఒకరు , సోలార్ స్కాం లో ప్రధాన నిందితురాలు మరొకరు ఆయనపై పోటీకి దిగుతున్నారు. ‘ఎలక్షన్ కింగ్ ’గా పేరు తెచ్చుకున్న తమిళనాడు సేలంకు చెందిన కే పద్మరాజన్ అనే వ్యక్తి వయనాడ్ నుంచి తన ‘201’వ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించి న ఆయన.. మరోసారి తన ‘రికార్డు అదృష్టాన్ని ’ పరీక్షించుకోబోతున్నారు.ఇక, ఇంతకుముందే వారం క్రితం తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆయన తన 200వ నామినేషన్ వేశారు. ఇప్పటికే తన పేరును గిన్నీస్ బుక్లో చేర్చారని చెప్పిన ఆయన.. కొన్ని కొన్నిసార్లు రాజకీయ నేతలు బెదిరింపులకు దిగిన సందర్భాలున్నాయని చెప్పారు.
* లోకేష్ ను సీఎం చేయాలన్నదే చంద్రబాబు తపనంతా- మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి
ముద్ద పప్పు లోకేష్ ను సీఎం చేయడానికి చంద్రబాబు నానా యాతన పడుతున్నారని నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు లోకేష్ కు కనీస పరిజ్ఞానం లేదని అటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి సీఎం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు లోకేష్ సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి గోవింద వుతుందని విమర్శించారు నెల్లూరు నగరంలో గురువారం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో లో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారని తెలిపారు చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరువు కాటకాలు సంభవిస్తాయని వర్షాలు ముఖం చాటేస్తాయని చెప్పారు అదే వైఎస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడుతూ రైతులకు ఇబ్బందులు ఉండవని గత కాలాన్ని ఉదహరించారు ఇప్పటికే వర్షాలు పడక బోర్లలో నీళ్లు రాక బావులు చెరువులు ఎండిపోయి రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు మళ్ళీ గనుక చంద్రబాబు అధికారంలోకి వస్తే జిల్లా ఎడారిగా మారడం తప్పదని జోస్యం చెప్పారు
*మోడీ పై దినకరన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
తమిళనాడులో కీలక ఏఐఏడీఎంకేను ప్రధాని నరేంద్ర మోదీయే కాదు ఆయన తండ్రి కూడా కాపాడలేరని ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకేతో భాజపా పొత్తు నేపద్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తండ్రి తరహాలో ఆ పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కాగా దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పదిహేడు మంది పై తమిళనాడు స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్దించడంతో ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు పళని స్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ పదిహేడు నియోజకవర్గాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకేకు దారుణ పరాజయం ఎదురైతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని ఏఎంఎంకే పేరుతొ సొంత పార్టీని ఏర్పాటు చేసిన దినకరన్ పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే దిగ్గజ నేత ఎం.కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరుపూర్ అసెంబ్లీ స్థానంలోనూ పద్దెనిమిదవ పోలిన్ నిర్వహిస్తారు.
*ఇప్పటివరకూ పట్టుబడిన నగదు ఎంతంటే?
ఎన్నికల వేళ ధనం, మద్య ప్రవాహానికి కొదవే ఉండదు. ఈ అక్రమాలపై దృష్టిపెట్టిన ఎన్నికల అధికారులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి వేల కోట్ల రూపాయాల నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ. 1550 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేసుకున్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ. 377.511 కోట్ల నగదు, రూ. 157 కోట్ల విలువైన మద్యం, రూ. 705కోట్లు విలువజేసే మాదకద్రవ్యాలు, రూ. 312కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బుధవారం ఓ భాజపా అభ్యర్థి కుమారుడి నుంచి రూ. 1.80కోట్ల అక్రమ నగదును అధికారులు జప్తు చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో కారు డోర్లలో దాచి పెట్టిన రూ. 2.10కోట్ల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
*మోడీ గడువు తీరిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవరం నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్దికి ‘వేగ నిరోధకం’గా మారారంటూ మోడీ తన పై చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనను గడువు తీరిన బాబుగా ఎద్దేవా చేహరు. సిమిలిగూడ కోల్ కతా బహిరంగ సభల్లో ప్రధాని మోడీ బుధవారం తృణముల్ ప్రభుత్వం పైనా మమతా బెనర్జీ పైనా పలు ఆరోపణలు చేయగా.. వాటికి అంశాల వారిగా ఆమె గట్టి జవాబిచ్చారు. కూచ్ బీహార్ జిల్లా దిన్ హటాలో నిర్వహించిన బహిరంగ సభలో చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరారు. పుల్వామా ఉగ్రడాది జరిగే అవకాశం ఉందంటూ ముందస్తూ నిఘా సమాచారం కేంద్రానికి ఉన్నప్పటికీ మోడీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. చౌకీదార్ ఓ ఫాస్తులా వ్యవహరిస్తున్నారు. మీరు వైమానిక దాడుల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఓటరు దాడిని మీరు త్వరలోనే చూస్తారు అని మండిపడ్డారు. తమను వ్యతిరేకించే ఎవరినైనా మోడీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని రాగలిగితే తన జోలికి రావాలంటూ ఆమె సవాల్ విసిరారు.
*యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ఈసీ నోటీసులు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ (మోదీజీ కీ సేనా)గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై వచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఈసీ దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆదిత్యనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో సైన్యానికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావద్దన్న మార్గదర్శకాలను ఆదిత్యనాథ్‌ ఉల్లంఘించారని ఈసీ అభిప్రాయపడినట్లు సమాచారం.
*వయనాడ్‌ లో నామినేషన్‌ వేసిన రాహూల్
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే కోళికోడ్‌ వెళ్లిన రాహుల్, ప్రియాంక.. ఈ ఉదయం వయనాడ్‌ చేరుకున్నారు. నామినేషన్‌కు ముందు వందలాది మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో రాహుల్‌ రోడ్‌షో చేపట్టారు.
*ఓటమి భయంతోనే ఈ అరాచకాలు :దేవినేని
కృష్ణా జిల్లా మైలవరం ఘటనకు జగన్‌ బాధ్యత వహించాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తన ప్రచారానికి ఎక్కువ మంది జనం రాలేదనే అక్కసుతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని అన్నారు. ఈ ఘటన ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. మైలవరంలో జగన్‌ ఓ భయానక వాతావరణాన్ని సృష్టించారని, దీనిపై జగన్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఓటమి భయంతోనే జగన్‌ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు.
*వయనాడ్‌ నుంచి రాహుల్‌ నామినేషన్‌
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రమే కోళికోడ్‌ వెళ్లిన రాహుల్, ప్రియాంక.. ఈ ఉదయం వయనాడ్‌ చేరుకున్నారు. నామినేషన్‌కు ముందు వందలాది మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో రాహుల్‌ భారీ ర్యాలీ చేపట్టారు.
*నమో టీవీ ఎందుకు ప్రారంభించారు?: ఈసీ
ఎన్నికల నియమావళి అమలులో ఉండగా నమో టీవీని ప్రారంభించడానికి అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలని కోరుతూ సమాచార, ప్రసార మంత్రిత్వ(ఐబీ) శాఖకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటలూ ప్రసారమయ్యే నమో టీవీని ఇప్పుడు ప్రారంభించడంపై ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీలు సోమవారం ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో దూరదర్శన్‌ ఛానెల్‌కి కూడా ఈసీ నోటీసులు పంపించింది. ఆ ఛానెల్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న ‘మై భీ చౌకీదార్‌’ కార్యక్రమాన్ని గంటపాటు ప్రత్యక్ష ప్రసారం ఎందుకు చేశారో చెప్పాలని కోరింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్ అరోడా మార్చి 10న ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినప్పటి నుంచీ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది.
*అఖిలేశ్‌కు పోటీగా ప్రముఖ నటుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సమాజ్‌ వాద్‌ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌పై పోటీగా భోజ్‌పురి నటుడు, గాయకుడు దినేశ్‌ లాల్‌ యాదవ్ ను భారతీయ జనతా పార్టీ బరిలోకి దింపింది. అఖిలేష్‌ ఆజంగఢ్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వ్యూహాత్మకంగా దినేశ్‌కు భాజపా టికెట్‌ ఇచ్చింది. దినేశ్, ప్రముఖ నటుడు రవికిషన్‌ ఇటీవలే భాజపాలో చేరారు. పూర్వాంచల్‌ ప్రాంతంలో వీరిద్దరికీ అభిమానులు ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే దినేశ్‌ను రంగంలోకి దింపింది.
*ఆ అభ్యర్థి ఆస్తులు 1.76 లక్షల కోట్లు!
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థికి ఈ స్థాయిలో ఆస్తులేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఏడాది బడ్జెట్‌కు మించి ఆస్తులు ప్రకటించిన ఆ అపర కుబేరుడు ఎవరని అంటారా! తమిళనాడుకు చెందిన ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి. పేరు.. జే మోహన్‌రాజ్‌. ఈయన రిటైర్డ్‌ సీఐ. పెరంబూరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో మోహన్‌రాజ్‌ బరిలో నిలిచారు. అఫిడవిట్‌లో తనకు రూ.1.76 లక్షల కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మీకు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయా? అని ప్రశ్నిస్తే.. ‘‘అంతా ఉత్తిదే’’ అన్నాడు. 2జీ కుంభకోణం విలువను దృష్టిలో పెట్టుకొని రూ.1.76 లక్షల కోట్లు తన ఆస్తులుగా చూపించానని.. తమిళనాడుకు ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని రూ.4లక్షల కోట్ల అప్పులున్నట్లు వెల్లడించానని వివరించారు. ఎన్నికల సంఘాన్ని ఎగతాళి చేసేందుకే తాను ఇలా పేర్కొన్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో కొందరు ఇష్టం వచ్చినట్లుగా ఆస్తులను ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు. అయితే తాను సమర్పించిన అఫిడవిట్‌ను ఈసీ ఆమోదించడాన్ని ఆయన ఆక్షేపించారు.
*ఎన్నికల బాండ్లు సబబే
ఎన్నికల బాండ్ల జారీ అంశంలో ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల్ని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది. బాండ్ల కోసం చట్టాల్లో తీసుకొచ్చిన మార్పులను సమర్థించుకుంటూ, రాజకీయ నిధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే దిశగా ఎన్నికల సంస్కరణలు తెచ్చేందుకు ఇది తొలి అడుగని సుప్రీంలో తాజాగా సమర్పించిన ప్రమాణపత్రంలో స్పష్టం చేసింది. గతంలో వ్యక్తులు లేదా కార్పొరేట్‌ సంస్థలు భారీ మొత్తంలో రాజకీయ విరాళాల్ని అక్రమ మార్గాలతో నగదుతో ఇచ్చేవారని పేర్కొంది.
*చైనీస్‌ భాషలోనూ ఎన్నికల ప్రచారం!
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.. తూర్పు కోల్‌కతాలోని తాంగ్రాలో మొట్టమొదటిసారి చైనీస్‌ భాషలో ప్రచారం ప్రారంభించింది. అక్కడ పదుల సంఖ్యలో గోడలపై ‘తృణమూల్ కాంగ్రెస్‌కే ఓటు వేయండి’ అంటూ చైనీస్‌ భాషలో రాశారు. అలాగే, ఆ పార్టీ ఎన్నికల చిహ్నం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిత్రాలను గోడలపై వేశారు. చైనా మూలాలున్న ప్రజలు కొందరు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. దీంతో ఈ భాషలోనూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ… తాము ఈ సారి చైనీస్‌ భాషలో కరపత్రాలను కూడా ముద్రించి ఈ ప్రాంతంలో పంచుతామని చెప్పారు.
*బాబుకు ఓటేస్తే ముంచేస్తారు
ఎన్నికలకు మూడు నెలల ముందు ఇస్తున్న తాయిలాలను చూసి చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే అన్ని విధాలుగా ముంచేస్తారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, ఒంగోలు, కృష్ణా జిల్లా మైలవరం సభల్లో ఆయన మాట్లాడారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపైనా ధ్వజమెత్తారు. సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావు అవినీతికి అంతులేకుండా ఉందని, స్పీకర్‌ వ్యవస్థను ఆయన భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన అవినీతి, మైనింగ్‌ అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు.
*మరో మూడు సీఎం సభలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో మూడు పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 9న ఎన్నికల ప్రచారం ముగియనుంది. గడువు పూర్తయ్యే వరకు ప్రచారాన్ని కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. గతంలో నిర్దేశించిన షెడ్యూలు మేరకు గురువారం వరకు సీఎం సభలున్నాయి. గురువారం ఆయన మహబూబాబాద్‌, ఖమ్మం నియోజకవర్గాల సభల్లో పాల్గొననున్నారు. దీంతో సీఎం 12 నియోజకవర్గాల్లో పర్యటించినట్లవుతుంది. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌తో అనుసంధానమై ఉన్న చేవెళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి మిగిలాయి.
*ఏపీకి ప్రత్యేక హోదా
జాతీయస్థాయిలో తమ కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హామీ ఇచ్చారు. జనసేన, బీఎస్పీ, వామపక్ష కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
*కాంగ్రెస్‌ మేనిఫెస్టో మోసపూరితం
కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) నిండా అబద్ధాలేనని, అది నయవంచక పత్రమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బుధవారం అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 220 కి.మీ. దూరంలోని పాసీఘాట్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని వారం రోజుల్లో రెండో సారి ఈ రాష్ట్రంలో పర్యటించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ ఎప్పడూ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ‘‘త్రివర్ణ పతాకాన్ని దహనం చేసి, అవమానించే వారికి, దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసేవారికి, విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యేవారికి, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి కాంగ్రెస్‌ సానుభూతి తెలుపుతోంది’’ అని ఆరోపించారు. 2014 నాటికి 18వేల గ్రామాలకు ఇంకా విద్యుత్తు సౌకర్యం కలిగించాల్సి ఉంటే ఆ లక్ష్యాన్ని తాము వేయి రోజుల్లో పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక కాలపరిమితి ఓట్ల లెక్కింపు రోజైన మే 23తో ముగిసిపోతుందని ఎద్దేవా చేశారు.
*సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్‌, తృణమూల్‌
కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌, సిలిగుడిల్లో జరిగిన సభల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌తోపాటు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదానికి తలవంచుతోందని విమర్శించారు. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే చట్టాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలా చేస్తే అది పాకిస్థాన్‌కు సహకరించినట్టు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌, తృణమూల్‌లు కలిసి సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని ఇతర ప్రాంతాలంత వేగంగా పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి చేయలేకపోతున్నానని, ఇందుకు స్పీడ్‌ బ్రేకర్‌లా వ్యవహరిస్తున్న దీదీయే కారణమని విమర్శించారు.
*ఎన్నికలకోసమే పసుపుబోర్డుపై హామీ
లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను పొందేందుకు భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోందని నిజామాబాద్‌ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఏళ్లుగా పట్టించుకోలేదని మండిపడ్డారు. కేవలం ఎన్నికలకోసమే మళ్లీ అధికారంలోకి వచ్చాక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని తప్పుడు హామీ ఇస్తున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌ మేజర్‌ పంచాయతీలో బహిరంగ సభ నిర్వహించారు.
*మోదీ అంటే కేసీఆర్‌కు భయం
శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను సీఎంగా గెలిపిస్తే ఆయన మాత్రం మోదీని మళ్లీ ప్రధానిగా చేసేందుకు చాలా కష్టపడుతున్నారని కాంగ్రెస్‌ ప్రచారతార, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరుతూ బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ గుర్తుకొచ్చేదని, ఇప్పుడు ‘చార్‌ఛోర్‌’లైన కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావులు దర్శమిస్తున్నారని విమర్శించారు.
*పార్లమెంటు హద్దులు తెలియని కేసీఆర్‌
పార్లమెంటు సభ్యుడిగా అయిదేళ్లు పనిచేసిన సీఎం కేసీఆర్‌కు కనీసం పార్లమెంటు భవనం హద్దులే తెలియవని, అలాంటి నాయకుడు 16 మంది ఎంపీలతో ప్రధాన మంత్రి ఎలా అవుతారని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
*మోదీ కార్పొరేట్‌ శక్తులకే చౌకీదార్‌
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు చౌకీదార్‌ కాదని, దేశంలోని కార్పొరేట్‌ శక్తులు, ధనవంతులైన అంబానీ, అదానీ, దొంగలు నీరవ్‌మోదీ వంటి వారికే కాపలాదారు అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఖమ్మంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ తాను చౌకీదార్‌నని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాపలాదారు సామాన్య ప్రజలకు అవసరం లేదని, దోపిడీదారులు, రౌడీ రాజకీయాలు చేసేవారికి, హత్యలకు పాల్పడేవారికి అవసరమని వ్యాఖ్యానించారు.
*ఎక్కడైనా చర్చకు సిద్ధం
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అందిన సాయంపై ఏ చౌరస్తాలో అయినా బహిరంగ చర్చకు భాజపా సిద్ధంగా ఉందని.. ఇందుకు సీఎం కేసీఆర్‌ ముందుకు రావాలని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ సవాల్‌ విసిరారు. ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్లలో తెలంగాణకు రూ.30 వేల కోట్ల నిధులను గ్రాంటుగా ఇచ్చిందని.. రూ.2.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సాయం విషయంలో ప్రధాని మోదీపై విమర్శలు చేసిన కేసీఆరే పచ్చి అబద్ధాలు ఆడారని.. ప్రధానమంత్రిని సర్పంచి స్థాయికి దిగజారారంటూ వ్యక్తిగతంగా దూషించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
*వివేక్‌ రాజీనామా ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి గడ్డం వివేక్‌ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అధిష్ఠానం టికెట్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన గత వారం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ, లేఖను సీఎంకు పంపించిన విషయం విదితమే.
*చౌకీదార్‌’ అండతోనే ఆర్థిక నేరగాళ్ల పరార్‌
‘చౌకీదార్‌’ సాయంతోనే ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచిపారిపోయారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బుధవారం అసోంలోని లఖింపూర్‌, బోకాఖట్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో దేశానికి చౌకీదార్‌నని చెప్పుకొంటున్న ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు చేశారు. దేశాన్ని దోచుకున్న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోస్కీలు ‘చౌకీదార్‌’ మద్దతుతో పరారయ్యారని అన్నారు. వారు దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేసి, దాన్ని ‘న్యాయ్‌’ పథకం కింద నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.
*రాహుల్‌కు క్షేత్రస్థాయిలో నేర్పుతాం
క్షేత్ర స్థాయిలో ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో రాహుల్‌ గాంధీకి తాము నేర్పుతామని సీపీఐ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వాయనాడ్‌లో రాహుల్‌ పోటీ చేయడంపై వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీపీఐ నేత ఒకరు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి తాము పోరాడుతామన్నారు. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం తమ అధినేత విజయావకాశాలకు ఎటువంటి ఢోకా లేదని పేర్కొంటున్నాయి.
*కాంగ్రెస్‌ ప్రచార కమిటీ సహ ఛైర్మన్‌గా ‘గూడూరు’
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి, తెలంగాణకు ఏఐసీసీ ప్రకటించిన ప్రచార కమిటీలో పలువురు నేతలకు చోటు కల్పించారు. కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తుండగా, ఇప్పుడు సహ ఛైర్మన్‌గా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని నియమించారు. సభ్యులుగా టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌, న్యాయవాది కె.రాజేశ్వర్‌రావు నియమితులయ్యారు.
*తెరాసను ఓడించాలన్న కసితో ఉన్నారు: పొన్నాల
రానున్న ఎన్నికల్లో తెరాసను ఓడించాలన్న కసితో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కొంతమంది ఎమ్మెల్యేలు-ఇతర సీనియర్‌ నేతలు పార్టీని వీడినందుకు కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొంత నైరాశ్యం ఉన్నప్పటికీ, తెరాసను ఓడించాలనే పట్టుదల మాత్రం కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధం ఉండదన్నారు.
*రాయలసీమలో కరవు జోన్‌!
రాయలసీమలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను 10ఏళ్ల పాటు ప్రత్యేక కరవు జోన్‌గా ప్రకటిస్తామని, ఆ జోన్‌లోని రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని జనసేన పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో (మేనిఫెస్టో) హామీ ఇచ్చింది. ఉత్తరాంధ్ర, కోనసీమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రకటించింది. రైతులకు ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం, 60 ఏళ్లు దాటిన రైతులకు రూ.5000 పింఛను, విద్యార్థులకు ఉచిత బస్సు, రైలు పాస్‌లు, యువతుల పెళ్లికి రూ.లక్ష వరకూ వడ్డీ లేని రుణం అందిస్తామని వెల్లడించింది. వీటితోపాటు వివిధ వర్గాల సంక్షేమానికి ఎన్నికల ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చింది. ఇందులో మొత్తం 96 హామీలను పొందుపరచింది.
*పసుపు-కుంకుమకు ఈసీ సై
ఆంధ్రప్రదేశ్‌లో పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు భారత ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున వీటి విడుదలపై ఎలాంటి ప్రచారమూ చేయరాదని షరతు విధించింది. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, రేడియో, ఇంటర్నెట్‌లతో పాటు ఇతర ఏ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయకూడదని పేర్కొంది. నిధులు లేదా చెక్కుల పంపిణీ కోసం ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ఆడంబరంగా నిర్వహించరాదని వివరించింది.
*పోలింగ్‌ సమయం గంట పెంపు!
రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ సమయాన్ని గంట పొడిగించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిపారు. ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు దాన్ని నిర్వహించనున్నారు.
*జగన్‌కు ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదు
జగన్‌కి భాజపా, కాంగ్రెస్‌, కేసీఆర్‌..ఇలా ఎవరితో కలవాల్సిన అవసరం లేదని, ఒంటరిగా ప్రజాబలంతోనే ముందుకు వెళ్తున్నారని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ స్పష్టీకరించారు. విశాఖ జిల్లా మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని చీడికాడ, రావికమతం గ్రామాల్లో బుధవారం ఆమె ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. చీడికాడ సభలో ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి హయాంలోని సంక్షేమ పాలన మళ్లీ చూడాలంటే జగన్‌కు పట్టం కట్టాలని కోరారు.
*తెదేపా పాలనకు చరమగీతం పాడాలి
తెదేపా హయాంలో దోపిడీలు, దుర్మార్గాలు పెచ్చుమీరి పోయాయని.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి చరమగీతం పాడాలని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం విజయరాయిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలతో సహా అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. పసుపు – కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇచ్చే డబ్బు వారు తీసుకున్న రుణాలపై వడ్డీకి కూడా సరిపోదన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఉదయం రామచంద్రాపురం కూడలి వద్ద కొల్లేరు ప్రాంతవాసులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
*తెలుగు విద్యార్థులపై మోదీకి వివక్ష ఏల?: చలసాని
అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ‘మోదీకి తెలుగు వారంటే అక్కసు. ఆయనకు గుజరాత్‌పై ఉన్న ప్రేమ ఇతర రాష్ట్రాలపై లేదు. జేఈఈ పరీక్షలు ఆంగ్లం, హిందీతో పాటు గుజరాతీ భాషలో పెడుతూ తెలుగులో ఎందుకు పెట్టడం లేదని.?’ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ప్రశ్నించారు.
*వైకాపాకు ఓటేస్తే ఎడారే: కనకమేడల
రాజకీయ ప్రయోజనాల కోసం జగన్‌ తెరాసతో చేతులు కలిపి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్ర చేస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు మూసేయాలని తెరాస చెబుతోంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాయలసీమలో పంట పొలాలను బీళ్లుగా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత తమకు అప్పజెప్పాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
*ఏపీ డీజీపీకి ఈసీ పిలుపు
ఏపీ డీజీపీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన హుటహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం సీఈసీతో డీజీపీ ఠాకూర్‌ భేటీ కానున్నారు. ఇటీవల డీజీపీ ఠాకూర్‌పై సీఈసీకి వైసీపీ, బీజేపీ ఫిర్యాదు చేసింది. డీజీపీగా తప్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఈసీ నుంచి డీజీపీకి పిలుపు రావడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఇంటెలిజెన్స్ డీజీ, మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
*లోటస్‌పాండ్‌, బెంగళూరులోని భవనాలు ఎవరివి?
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌, బెంగళూరులోని భవనాలు ఎవరి పేరు మీద ఉన్నాయో, క్విడ్‌ ప్రోకో పద్ధతిలో ఎవరి నుంచి వచ్చాయో జగన్‌ చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ డిమాండ్‌ చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో జగన్‌ గోబెల్స్‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం చంద్రబాబు తనకున్న ఆస్తులన్నీ వివరించిన విషయం తెలీదా అని ప్రశ్నించారు. జగన్‌కు తన కుటుంబ సభ్యుల పరిశ్రమలు కనిపిస్తున్నాయే తప్ప రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
*తెదేపా హయాంలోనే ఆర్యవైశ్యులకు లబ్ధి: అంబికాకృష్ణ
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనన్ని పనులు తెదేపా సర్కారు ఆర్యవైశ్యులకు చేసిందని, వారి పయనం సీఎం చంద్రబాబు వెంటేనని రాష్ట్ర టీవి, చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికాకృష్ణ స్పష్టం చేశారు. ఉండవల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పేద ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వం మొదటి ఏడాది రూ.30 కోట్లు కేటాయించింది. రెండో ఏడాది రూ.50 కోట్లు కేటాయించడంతోపాటు మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఏమీ చేయలేదన్న ప్రతిపక్షం మాటలు నమ్మొద్దు’ అని వ్యాఖ్యానించారు.
*తెలుగు విద్యార్థులపై మోదీకి వివక్ష ఏల?: చలసాని
‘మోదీకి తెలుగు వారంటే అక్కసు. ఆయనకు గుజరాత్‌పై ఉన్న ప్రేమ ఇతర రాష్ట్రాలపై లేదు. జేఈఈ పరీక్షలు ఆంగ్లం, హిందీతో పాటు గుజరాతీ భాషలో పెడుతూ తెలుగులో ఎందుకు పెట్టడం లేదని.?’ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై వివక్షత చూపుతున్నారని..ఇది చాలా బాధాకరమని అన్నారు.
*అవినీతి తిమింగలాన్ని అందలమెక్కిస్తారా: యామినీశర్మ
అవినీతి తిమింగలం లాంటి వైకాపా అధ్యక్షుడు జగన్‌ను అందలమెక్కించేందుకు ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి వైఎస్‌ షర్మిల పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ విమర్శించారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెదేపా కార్యకర్తలు, నాయకులను దారుణంగా హతమార్చి ఎంత మంది మహిళల పసుపు-కుంకుమ చెరిపేశారో వారిద్దరూ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
*తెదేపా, వైకాపా హామీలకు రూ.20 లక్షల కోట్లు కావాలి: ఐవైఆర్‌
తెదేపా, వైకాపా నేతలు ఎన్నికల్లో ఇస్తున్న హామీలు నెరవేర్చటానికి రూ.20 లక్షల కోట్లు కావాలని, రాష్ట్ర ఆదాయం రూ.1.70 లక్షల కోట్లేనని భాజపా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన బుధవారం భాజపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ‘వైకాపా, తెదేపాలు వరాలకే పరిమితమయ్యాయి. మేనిఫెస్టో విడుదల చేసే ధైర్యం లేదు. జనసేన పార్టీకి ఎజెండా లేదు.
*రాహుల్‌కు క్షేత్రస్థాయిలో నేర్పుతాం
క్షేత్ర స్థాయిలో ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో రాహుల్‌ గాంధీకి తాము నేర్పుతామని సీపీఐ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వాయనాడ్‌లో రాహుల్‌ పోటీ చేయడంపై వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీపీఐ నేత ఒకరు మాట్లాడుతూ ఈఎన్నికల్లో విజయం సాధించడానికి తాము పోరాడుతామన్నారు. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం తమ అధినేత విజయావకాశాలకు ఎటువంటి ఢోకా లేదని పేర్కొంటున్నాయి.
*అన్నగారి పాత్రలో అదుర్స్
ద్వీచక్ర వాహనం పావు పోలీసు వేషధారణలో అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ ను తలపిస్తున్న ఈ వ్యక్తీ పేరు నర్సింగరావు. విశాఖలోని మాధవధారకు చెందిన ఈయనకు ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం నర్సింగరావు గతంలో ఎన్టీఆర్ చిత్రాలతో పాటూ మరికొన్ని సినిమాల్లోనూ నటించారు. బుధవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని అల్లీపురంలో తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పోలీసు వేషధారణలో పాల్గొని పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
*భాజపాలోకి మాజీ ఐఎఎస్ రత్నప్రభ
కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాని కార్యదర్శి రత్నప్రభ భాజపాలో చేరుతారని కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. బుధవారం ఆమె పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కలబురాగి లోక్ సభ నియోజకవర్గ భాజపా అభ్యర్ధి ఉమేష్ జాదవ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆమె అక్కడే పార్టీ రాష్ట్ర అద్యక్షుడు యడ్యూరప్ప ఇతర జిల్లా నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. తెలుగువారిన రత్నప్రభ ఏపీలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు పరిశ్రమల శాఖ అధికారిణిగా పని చేశారు.
*సోనియా పై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ
సోనియా గాంధీ అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తదితర కీలక ప్రతిపక్ష నేతలు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాలకు భాజపా తన అభ్యర్ధులను బుధవారం ప్రకటించింది. రాయ్ బరేలీ నుంచి సోనియాకు ప్రత్యర్ధిగా దినేష్ ప్రతాప్ సింగ్ పేరును ప్రకటించింది. స్థానికంగా పలుకుబడి ఉన్న దినేష్ ప్రతాప్ సింగ్ గత ఏడాదే కాంగ్రెస్ ను వీడి భాజపాలో చేరారు. సమాజ్ వాదీ పార్టీ సారధి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న అజంగ్హాడ్ నుంచి ప్రముఖ భోజ్ పురీ నటుడు దినేష్ లాల్ యాదవ్ కు టికెట్ను ఇచ్చింది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న మొయిన్ పూరి స్థానానికి ప్రేమ సింగ్ షఖ్యాను నిలబెట్టింది.