DailyDose

గుంటూరు టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడి–నేరవార్తలు–04/04

income tax raids on kovelamudi ravindra house

* టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. నెల రోజుల క్రితమే ఒకసారి కోవెలమూడి సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మళ్లీ ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవెలమూడి రవీంద్ర గుంటూరులో బలమైన టీడీపీ నేతగా ఉన్నారు. టీడీపీ నేతల ఆస్తులపై వరుసగా ఐటీ దాడులు చేయడంపై మండిపడుతున్నారు. నిన్న ప్రొద్దుటూరులో పుట్టా సుధాకర్‌ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. వరుసగా టీడీపీ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు చేయడంపైసీఈవో ద్వివేదికి ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు.
* కీసర కంచకచర్ల మధ్య లో కారు బోల్తా…కొంత మంది యువకులకు గాయాలు..
* ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు రూ.100కోట్ల జరిమానాను విధించింది. కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వుతున్నారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కోర్టు ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానాను విధించింది. తదుపరి విచారణను జులై 23కు వాయిదా వేసింది.
*ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. కేసు విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును బుధవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. కాసేపటి విచారణ అనంతరం కేసును ఈనెల పదహారవ తేదీకి వాయిదా వేశారు. కాగా ఓ కేసు విచరణ నిమిత్తం హైదరాబాద్ కు వస్తోన్న జగన్ పై గతేడాది వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. విమానాశ్రయంలో రెస్టారెంట్ లో పని చేసే శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో జగన్ పై దాడి చేసాడు. ఈ ఘటనలో జగన్ భుజానికి స్వల్ప గాయమైనది. ఈకేసును మొదట పోలీసుకు చేపట్టినా తడువత ఎన్ఐఏ కు అప్పగించిన విషయం తెలిసిందే.
* ఐ ర్ కృష్ణారావు కామెంట్స్…
ప్రజల ను చంద్రబాబు మోసం చేస్తున్నారుచంద్రబాబు కు సూటి ప్రశ్న..పరిశ్రమ రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తున్నారని కాంగ్రెస్ చెప్పగలదా..పరిశ్రమ రాయితీ లేని హోదా అయిన ప్యాకేజి అయిన ఒకటే …ప్రజలను ఎలక్షన్ టైం లో కాన్ఫఉజ్ చేస్తున్నారుచంద్రబాబు చాలా సింపల్ గా అబద్దాలు చెప్పగలరుముఖ్యమంత్రి స్థాయి దగ్గ మాటల మాట్లాడటం లేదుచంద్రబాబు దేశం మొత్తం ప్రచారం చేస్తే మాకు లాభమే మీ మీడియా మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది .దేశం మొత్తం తెలుసు నీ జాతకం తెలుసుసొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు కేంద్రం డబ్బులతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నారు..మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ,కేసీఆర్,మోడీ అని విషప్రచారం చేస్తున్నారుఈ రోజు వరకు మేనిఫెస్టో రిలీజ్ చెయ్యని పార్టీలకు ప్రజలు లను ఓటు హాడిగే హక్కు లేదుబీజేపీ న్యాయానికి నిజాయితీ, పారదర్శక పాలనకు కట్టుబడి ఉందిపసుకు కుంకుమ అనే ఇదే చివరది…ఇంకా డబ్బులు పడవు చంద్రబాబు అన్ని కులాలు లకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లు మళ్ళీ చంద్రబాబు గెలిస్తే తీసివేస్తారు…ఎందుకంటే చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసు
* మురళీమోహన్‌పై కేసు నమోదు.
రాజమండ్రి ఎంపీ, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డ 2 కోట్ల రూపాయలకు సంబంధించి మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.ఈ ఘటనపై గురువారం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలకు నిమ్మలూరి శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో అనుమానస్పదంగా కనిపించారు.దీంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 2 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా జయభేరి ఉద్యోగులు జగన్మోహన్‌, ధర్మరాజులు వారికి డబ్బు ఇచ్చినట్టు నిందితులు తెలిపారు. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌ రాజమండ్రిలో ఎదురుచూస్తుంటారని కూడా పేర్కొన్నారు. హైటెక్‌ సిటీ నుంచి సికింద్రాబాద్‌, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌ ట్రైన్‌లో రాజమండ్రికి తరలించేందుకు నిందితులు యత్నించారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిపై ఐపీసీ సెక్షన్‌ 171(బీ), (సీ), (ఈ), (ఎఫ్‌) లకింద కేసు నమోదు చేశామ’ని వెల్లడించారు.ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మురళీమోహన్‌ కోడలు రూపకు అందజేయడానికే ఆ మొత్తం తీసుకెళ్తున్నామని నిందితులు అంగీకరించారు.
* తాను వైసీపీలో చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సినీ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి మోహన్ బాబుకు వచ్చినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
*గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అత్తమామలు, భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు బొప్పూడి వెంకటరావు. ఈ ఘటనలో అత్తమామలు మంగమ్మ, రామకృష్ణ, భార్య అనితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
*ఎన్నికల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లో భారీగా నగదును పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగదు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు బుధవారం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో మాటు వేశారు. ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద బ్యాగుల్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడంతో అదుపులోకి తీసుకుని మాదాపూర్ టాణాకు తరలించారు. రూ.కోటి విలువైన ఐదు వందల రూపాయల నోట్లు, మరో కోటి విలువైన 2000రూపాయల నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వారిద్దరూ ప్రముఖ నిర్మాణ రంగ సమస్తః జయభేరీ ఉద్యోగులైన నిమ్మలూరి శ్రీహరి ఆరుటి పండరీ అని.. ఆ డబ్బును రాజమహేంద్రవరం తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడైంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ లో సికింద్రాబాద్ కు, అక్కడి నుంచి రైలులో రాజమహేంద్రవరం వెళ్ళే ఆలోచనతో ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ డబ్బును అక్కడ ప్రస్తుతం తెదేపా తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్ధికి అప్పగించేందుకు తీసుకేల్తున్నామని వారు అంగీకరించినట్లు తేలిసింది.
*గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి.. తన భార్య, అత్త, మామలపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై కత్తితో నరకడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొప్పుడి వెంకట్రావు.. మామ అనగాని రామకృష్ణ ఇంట్లోనే భార్యతో కాపురం ఉంటున్నాడు. కుటుంబంలో గత కొంతకాలంగా కలహాలు నెలకొన్నాయి.
*గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వడ్డిముక్కలలో బుధవారం వైకాపా అభ్యర్థి కిలారి వెంకటరోశయ్య ప్రచారానికి ఎదురు వెళ్లిన తెలుగుదేశం కార్యకర్త వడ్రాణం వీరరాఘవయ్యపై కొందరు వైకాపా నాయకులు దాడిచేసి గాయపర్చారు.
*గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జగన్‌ సభ ముగిసిన అనంతరం హద్దుగా ఉన్న రేకులను పట్టుకుని దిగుతున్న కార్యకర్తలకు విద్యుదాఘాతమై ఒకరు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి.
*పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద వైకాపాకు చెందిన 2200 డమ్మీ (డెమో) ఎలక్ట్రానిక్‌ ఈవీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*కృష్ణా జిల్లా గన్నవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత తెదేపా అభ్యర్థి డా.వల్లభనేని వంశీమోహన్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందన్న వార్త జిల్లాలో కలకలం సృష్టించింది. 2008లో ఓ కేసుకు సంబంధించిన వాయిదా కోసం వంశీ నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయుధాలతో న్యాయస్థాన ప్రాంగణంలోకి ప్రవేశించడంతో నాంపల్లి స్టేషన్‌లో కేసు నమోదైంది.
* ‘తెలంగాణ ఇంటెలిజెన్స్‌ శాఖ..ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై చేసిన సర్వే’ అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.హరిప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విడుదల చేసిన ఓ వీడియోను గుర్తించామన్నారు.
*హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ లాకప్‌లో హత్య కేసు నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. లాకప్‌లో కొట్టినందువల్లే మృతి చెందాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పోలీసులు మాత్రం మూర్ఛతోనే అతను మరణించాడని చెబుతున్నారు.
* ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఝార్ఖండ్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా పరిగి ప్రాంతానికి వచ్చిన ఆస్రాపౌల్‌ దివాన్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ మృతదేహాన్ని.. కొన్ని గంటల అనంతరం కనుగొన్నారు. మల్లెమోనిగూడ శివారులో కాలకృత్యాల కోసం వెళ్లిన అతడి జాడ తెలియకపోవడంతో, మంగళవారం నుంచి పోలీసులు వెతకడం మొదలుపెట్టారు.
*పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్న పోలీసులకు నోట్ల కట్టలు చిక్కుతున్నాయి. హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనంలో తరలిస్తున్న రూ.48లక్షలను బుధవారం పట్టుకున్నారు.
*ఎన్నికల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌లో భారీగా నగదును పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగదు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు బుధవారం సాయంత్రం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలో మాటు వేశారు.
*ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో పక్కా సమాచారంతో జరిపిన సోదాల్లో రూ.70 లక్షల నగదు లభ్యమైంది. కొత్తపేట పంచాయతీ పరిధిలోని ప్రసాద్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు వసతిగృహంపై పోలీసులు బుధవారం తెల్లవారుజామున దాడి చేశారు.
*పశ్చిమ గోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. 350 డమ్మీ ఈవీఎంలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖకు వ్యాన్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు.
*ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ వ్యవహారం ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న విషయం తెలిసిందే. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
*కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా అధినేత జగన్‌ సభకు బందోబస్తుగా వచ్చిన పోలీసులపై వైకాపా కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
*అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ వాహనశ్రేణి నుంచి రూ.1.8 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విలేకరులకు చూపించారు. బుధవారం ఉదయం ఆ రాష్ట్రంలోని పాసీఘాట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారని, ఆ సభ ఏర్పాట్ల నిమిత్తం మంగళవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి వెళ్లారని తెలిపారు. వాహనశ్రేణిలో ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు తాపిర్‌ గావో ఉన్నారని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రతినిధుల సమక్షంలో అధికారులు, పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం వ్యయ అధికారి సమిత్రా కౌర్‌ గిల్‌, పాసీఘాట్‌ డిప్యూటీ కమిషనర్‌ కిన్నీ సింగ్‌లు చూస్తుండగా నోట్లను లెక్కించారని తెలిపారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, ప్రధాని మోదీపైనా కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండు చేశారు.
*ఆగ్నేయాసియా దేశమైన బ్రూనేలో కఠిన శిక్షలతో కూడిన ఇస్లామిక్‌ షరియా చట్టాలు బుధవారం అమల్లోకి వచ్చాయి. వ్యభిచారం, ఇద్దరు పురుషుల మధ్య లైంగిక చర్యలకు రాళ్లతో కొట్టి చంపడాన్ని శిక్షగా విధించనున్నారు. దీనిపై బ్రూనే సుల్తాన్‌ హసనల్‌ బోల్కియ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఇస్లామిక్‌ బోధనలు బలంగా పెరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టాల కింద అత్యాచారం, పురుషుల మధ్య స్వలింగ సంపర్కం, దోపిడీ, ప్రవక్త మహ్మద్‌ను అవమానించడం వంటి నేరాలకు మరణశిక్ష వర్తిస్తుంది. ఇద్దరు మహిళల మధ్య లైంగిక చర్యకు 40 కొరడా దెబ్బలు లేదా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష విధిస్తారు. గర్భస్రావానికి కూడా బహిరంగ కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. దొంగతనం చేస్తే చేతులు, పాదాల్ని తొలగిస్తారు. 18 ఏళ్ల వయసులోపు ముస్లిం చిన్నారులను ఇస్లామేతర మత బోధనల వైపు ప్రోత్సహించడం నేర చర్యే. కొత్త శిక్షలపై అంతర్జాతీయంగా ఖండనలు వ్యక్తమయ్యాయి. ఐరాస, ఐరోపా సమాఖ్య ఖండించాయి.
* కొలంబోలో సీనియర్ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారి దిల్‌రుక్ష సమరసింఘే ఇవాళ ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కొలంబో పేజ్ వెబ్‌సైట్ ఓ కథనంలో పేర్కొంది.