నవ్యాంధ్ర తొలి శాసనసభ సభాపతి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే డాక్టర్ కోడెల శివప్రసాదరావు 35 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుని.. సరికొత్త ప్రస్థానం వైపు అడుగులు వేస్తున్నారు. మరోసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. కోడెల అసెంబ్లీ ఎన్నికల్లో తలపడటం ఇది తొమ్మిదోసారి. వైకాపా తరఫున గత ఎన్నికల్లో బరిలో నిలిచిన అంబటి రాంబాబు మరోసారి పోటీపడుతున్నారు. జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. జనసేన ప్రభావంపై తెదేపా, వైకాపాల్లో అంతర్లీనంగా ఆందోళన ఉంది. గత ఎన్నికల్లో కోడెల నరసరావుపేట నుంచి ఈ నియోజకవర్గానికి మారారు. కోడెల స్వగ్రామం కండ్లకుంట సత్తెనపల్లి పరిధిలోనే ఉంది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా నరసరావుపేట స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో కోడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలోరూ.1250కోట్లతో అభివృద్ధి, సంక్షేమం, మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేసి చేపట్టిన పనులే తనను మరోసారి గెలిపిస్తాయనే ధీమాతో ప్రచారం చేస్తున్నారు.ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించి స్వచ్ఛ సత్తెనపల్లిగా గుర్తింపు తీసుకువచ్చారు. గ్రామాల్లో చెరువుల పూడిక తొలగించడం, శ్మశానాల అభివృద్ధి, సిమెంట్ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు.పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణతో పాటు రక్షిత చెరువును ఆధునికీకరించి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లా తయారు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.వంద పడకల ఆసుపత్రిని నిర్మించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. సత్తెనపల్లి మీదుగా వెళ్లే హైదరాబాద్ మార్గాన్ని పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసలుగా విస్తరణకు నిధులు తీసుకువచ్చారు.పెన్నా-గోదావరి అనుసంధాన పనులు ఈ నియోజకవర్గంలోనే ప్రారంభించారు. కేంద్రీయ విద్యాలయం, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.ద్వితీయశ్రేణి నాయకులను ఆకట్టుకోలేకపోవడం.అభివృద్ధి పనుల్లో కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరోపణలు.కొందరు నేతలు తెదేపాను వీడి వైకాపాలో చేరడం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అభివృద్ధి పనుల్లో కోడెల కుటుంబ సభ్యుల జోక్యమే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు.అధికార పార్టీతో పాటు కోడెల కుటుంబంపై తాను చేసే ఆరోపణల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. సొంత సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు.స్థానికేతరుడు కావడం. ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం.సొంత పార్టీలో అసమ్మతివాదులు. వెంకటేశ్వరరెడ్డి ప్రభావం..గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి బలపరచాలని కోరుతున్నారు.పవన్‌కల్యాణ్ కరిష్మా, అభిమానుల మద్దతుపై ఆశలు పెట్టుకున్నారు.
సత్తెనపల్లిలో సుడులు తిరుగుతున్న కోడెల
Related tags :