Movies

ఆ లాజిక్ రాజ్యాంగంలో రాశారా?

shruthi love and wedding

త్వరలోనే తెలుగుతమిళ భాషల్లో సినిమాలు చేయబోతున్నట్లు చెప్పింది.పెళ్లి విషయంలో తనకంటూ కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలున్నాయని చెబుతున్నది శృతిహాసన్. అందరిలా రొటీన్‌గా ఆలోచించడం తనకు నచ్చదని అంటోంది. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నది శృతిహాసన్. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సేల్‌తో చాలా కాలంగా శృతిహాసన్ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. పలు ప్రచార కార్యక్రమాల్లో ఈ జంట సన్నిహితంగా కనిపిస్తుండటంతో త్వరలోనే మైఖేల్ కోర్సేల్‌ను ఆమె పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పెళ్లి పుకార్లపై శృతిహాసన్ స్పందిస్తూ ప్రేమిస్తే పెళ్లి చేసుకొని తీరాలనే నియమమేమీలేదని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ప్రేమ ఎలాంటి షరతులు లేకుండా నిస్వార్థంగా ఉంటుంది. ఒకరితో ప్రేమలో ఉంటే అతడిని ఫలానా సమయంలోగా పెళ్లిచేసుకోవాలనేం లేదు. అలాంటి షరతులు ఉంటే అది ప్రేమ కాదు. రెండు మనసులతో ముడిపడిన అంశమది. నా పెళ్లికి తొందరేం లేదు. దాని గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు. పెళ్లి సమయం వస్తే అందరికి చెప్పి చేసుకుంటాను అని తెలిపింది. అలాగే అంతర్జాతీయ ఆల్బమ్ కోసం సినిమాలకు దూరంగా ఉంటున్న.