ప్రధాని మోడీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగ పరుస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ బే-ఏరియా ఎన్నారైలు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీలో ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా సాగేందుకు చొరవ తీసుకోవల్సిందిగా రాష్ట్రపతికి విన్నవిస్తూ కాన్సుల్ జనరల్ రోహిత్ రతీష్ ద్వారా వినతిపత్రాన్ని అందజేశారు. కోగంటి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో సతీష్ అంబటి, సుబ్బ యంత్ర, లక్ష్మీపతి, వెంకట్ కోడూరు, పోతినేని శ్రీనివాస్, గుమ్మడి విజయ్, భాను పొలిశెట్టి, జోగినాయుడు, శ్రీని వల్లూరిపల్లి, రజనీకాంత్, సుభాష్, అనిల్, అంజిబాబు, శ్రీనివాస్ కోగంటి, ఎంవి రావు, హేమంత్, సురేష్ పోతినేని, వెంకట్ తాడికొండ, సతీష్ కొండపర్తి తదితరులు పాల్గొన్నారు.