Movies

అక్షయ్-అడ్వాణీ

akshay advani to team

బాలీవుడ్‌ కథానాయుడు అక్షయ్‌కుమార్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ‘కేసరి’తో మరో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘గుడ్‌న్యూస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. లారెన్స్‌ నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌లో కూడా నటిస్తున్నారు. అందులో అక్షయ్‌కు జోడీగా కియారా అడ్వాణీని తీసుకున్నారట. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కథానాయకుణ్ని ఓ ట్రాన్స్‌జెండర్‌ ఆత్మ ఆవహించే నేపథ్యంతో సాగే ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయం అందుకుంది. ‘గుడ్‌న్యూస్‌’లో కూడా కియారా నటిస్తోంది.