NRI-NRT

స్కాట్‌ల్యాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

telugu association of scotland ugadi 2019

తెలుగు సంవత్సరాది ఉగాది – అందరు బాగుండాలి, అందులొ మేము ఉండాలి – అందరికి “వికారి” నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున, డల్కిత్ హై స్కూల్ ప్రాంగణం, ఎడింబరొ, స్కాట్లాండ్ లో “వికారి నామ సంవత్సరాన్ని స్వాగతిస్తు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఉగాది పచ్చడి మరియు షడ్రుచుల పిండివంటలతో కూడిన విందుతో మొదలైన మధ్యానం, జ్యోతి ప్రజ్వలన తో మరియు మా తెలుగు తల్లి గీతం ఆలాపన తొ ప్రారంభించి టాస్ కార్యవర్గం సభ్యులను పలువురు ప్రముఖులను స్వాగతించేరు. స్థానికంగా ఉన్న మనబడి చిన్నారులు సందర్భోచిత ప్రదర్శన, వివిధ తెలుగు చిన్నారులు, యువత ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి – భరతనాట్యం, చలనచిత్ర సంగీత నృత్యాలు, దేశభక్తి నాటికలు బరిత మరియు వాయిద్య కచేరీల తో ఆద్యంతం కార్యక్రమం ఆహుతులను ఆనందపరిచారు. ఈ వేడుకలు పండుగ రోజునే నిర్వహించ గల సౌలభ్యం తొ టాశ్ అధికారిక కార్యవర్గం ఒక కొత్త ఓరవడి సృష్టించి, కన్నడ మరియు పంజాబి భాష తరపున ఒక సాంస్కృతిక కార్యక్రమం స్వాగతించారు. తదుపరి,సత్య స్యాం జయంతి- సభాపతి (చైర్మన్) &మైథిలి కెంబూరి- అధ్యక్షురాలు 2018-2020 అధికారికి కార్యవర్గాన్ని (www.teluguscot.org.uk) రంగస్థలానికి ఆహ్వానించి, ఈ క్రింది విషయాలు వెల్లడించారు:

*** సంస్థ యొక్క ఖాత, జమ పట్టీ వివరాలు :: వెంకటేష్ గడ్డం- కోశాధికారి ప్రామణికతను
*** ప్రతి వేడుకలు కి జరుగు సాంస్కృతిక ఎంపిక పద్ధతులు :: ఉదయ్ కుచడి- సాంస్కృతిక కార్యదర్శి ప్రత్యేకత
*** తెలుగు భాష & సంస్కృతి అభివ్రుధికి సంస్థ చేయగల తోడ్పాటు :: రవితెజస్వి కంటమనేని- మహిళా కార్యదర్శి పని నాణ్యత
*** స్వచ్చంద (వాలంటీర్స్) సభ్యుల నమోదు :: నీరంజన్ నూక- ప్రసార మాధ్య కార్యదర్సి నిపుణత
*** అంతర్జాల కార్యక్రమ వర్తమాన సందేశాలు :: ఛైతన్య ప్రత్తిపాటి- అంతర్జాల కార్యదర్శి పనితనము
*** క్రీడా, ఆరోగ్య సంభదిత కార్యక్రమాలు :: రంగనాథ్ నరుకుల్ల – క్రీడా కార్యదర్శి ఆలొచనా విధానాలు
*** భవ్యిషత్ కార్యచరణ & కార్యక్రమాలు :: మాధవిలత దండూరి. యోజనా కార్యదర్శి ఓపికా సమగ్రతను

చివరన,శివ చింపిరి- ప్రధాన కార్యదర్శి తెలిపిన కృతజ్ఞతల ఓటు తో పాటు మన జాతీయ గీతం “జన గణ మణ” వందన సమర్పణ తొ టాశ్ వికారి నామ సంవత్సర వేడుకలు ఘనంగా అహ్లాద భరితంగా ముగిశాయి.