NRI-NRT

బర్మింగ్ హాం-సింగపూర్-దక్షిణకొరియా-హాంగ్‌కాంగ్‌లలో ఉగాది సంబరాలు

hongkong singapore south korea hongkong ugadi 2019

1.సింగపూర్‌లో ఉగాది వేడుకలు
సింగపూర్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు వికారి నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కల్చరల్‌ సొసైటీ, సింగపూర్‌ ఆధ్వర్యంలో అరుళ్ముగు వేలు మురుగన్‌ జ్ఞానమునీశ్వర్‌ ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. వేడకల్లో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ చేసినట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నీలం మహేందర్‌, బసక ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సింగపూర్‌లోని వందలాది మంది ప్రవాస తెలంగాణవాసులు కార్యక్రమంలో పాల్గొన్నారని, ఎంతో ఆహ్లాదంగా వేడుకలు జరిగినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన, సమన్వయకర్తలుగా వ్యవహరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
2.బర్మింగ్‌హామ్‌లో రామభద్రుని కల్యాణం
శ్రీరామ కల్యాణం.. లోకకల్యాణం కోసమే! ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. నీలమేఘ శ్యాముడి సీతాపరిణయ ఘట్టం ముగ్ధమనోహరం.. జన్మరాహిత్యం.శ్రీరామనవమి వచ్చిందంటే ఊరూరా కోదండరాముడి కల్యాణ వేడుకలే. ఇక భద్రాద్రి రాముడి కల్యాణం చూస్తే జన్మ తరించిపోతుంది. అలాంటి కల్యాణాన్ని ఇంగ్లాండ్‌లోని ప్రవాసులకు అందించాలనుకున్నారు ప్రవాసాంధ్రులు డాక్టర్‌ జమలాపురం హరిగోపాల్‌. మరో ప్రవాసులు ధనుంజయరావుతో కలిసి ఇరవై మూడేళ్ల కిందట తొలిసారి శ్రీరామకల్యాణాన్ని బర్మింగ్‌హామ్‌లో నిర్వహించారు. ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. మరో వారంలో శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న వేళ… మొదటిసారి శ్రీరామచంద్రుడి కల్యాణాన్ని నిర్వహించడానికి ఎలా తపన పడిందీ, ఎవరెవరు సహకరించిందీ… ఇలా గుర్తు చేసుకున్నారు డాక్టర్‌ హరిగోపాల్‌. అది 1963. శ్రీరామ నవమికి భద్రాచలం వెళ్లాం. అక్కడ ఎటుచూసినా భక్తి పారవశ్యం. ‘‘అమ్మా సీతమ్మతల్లీ, రామ్మా.. ఈ దీనులందరినీ ఉద్ధరించు తల్లీ’’ అంటూ శ్రీరాముని కల్యాణ మహోత్సవం రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం. అక్షరాలుగా రాస్తుంటే, ఇప్పటికీ చెవుల్లో ఆ కంఠస్వరం వినపడుతూనే ఉంటుంది. ‘‘1995 డిసెంబరు. బర్మింగ్‌హామ్‌లో ముగ్గురు స్నేహితులం కలిశాం. మాటలు ప్రవాహమయ్యాయి. అప్పుడొచ్చింది శ్రీరామ నవమి ప్రస్తావన. ‘మనం కూడా అలాంటి కార్యక్రమం ఇక్కడ చేద్దాం’ అన్నాను. వాళ్లూ సరేనన్నారు. కానీ ఆ తర్వాత అంత పెద్ద కార్యక్రమం చేయడం కష్టమని విరమించుకొన్నారు. అప్పుడు నేను ఇదే విషయాన్ని కందుల ధనుంజయరావుగారితో చర్చించాను. ఆయన వెంటనే ‘తప్పకుండా చేద్దాం, ఎంత ఖర్చయినా సరే..’ అని గట్టిగా ప్రోత్సహించారు. అనుకున్నదే తడవుగా వ్యాఖ్యానం చెప్పడానికి ఒక పండితుడు, కల్యాణం చేయించడానికి ఇద్దరు పురోహితులు, ఒక హరికథకుడు, తెలుగు వంట చేయగలిగిన వ్యక్తి… మొత్తం ఐదుగురిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి పిలిపించి, ఇక్కడ సీతారామ కల్యాణం చేయించాలనుకున్నాం.
3.హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య(టీహెచ్‌కేటీఎస్‌) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాంకాంగ్‌ హిందూ స్వయం సేవక సంఘం అధ్యక్షులు జై ప్రకాశ్‌ గోయల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్న తెలుగువారంతా కుటుంబాలతో సహా ఒకచోట చేరి ఉగాది వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో తెలుగు సమాఖ్య కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తాం. టీహెచ్‌కేటీఎస్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇగే కొనసాగించాలి.’ అని ఆకాంక్షించారు.
4.దక్షిణ కొరియాలో ఘనంగా ఉగాది సంబరాలు
దక్షిణ కొరియాలో సుంగ్‌క్యున్‌ క్వాన్ విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కొరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ జరిగిన ఉగాది వేడుకలకు 100మందికి పైగా హాజరు అయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అతిథులకు ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్లాసికల్ డ్యాన్స్‌లు, పిల్లల ఫ్యాషన్ షో కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా. సుశ్రుత కొప్పుల, డా.వేణు నూలు, డా.అనిల్ కావాలా, తరుణ్, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
5.టీసీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 800 మంది ప్రవాసీ తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, ప్రసాదం దాతలకు సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి వెంకట్ రమణ, గోనె నరేంద్ర, కల్వ రాజు, రోజా రమణి, పద్మజ, ప్రసాద్‌లు వ్యవహరించారు.