NRI-NRT

ఓటేసిన ప్రవాస ప్రముఖులు

non resident telugus vote in 2019 elections

ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించారు. తెదేపా, వైకాపా తరపున ప్రచారాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపునే అత్యధికంగా ప్రవాసాంధ్రులు ప్రచారం చేశారు. దీనిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. అమెరికాలో ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధి కోమటి జయరాం కృష్ణాజిల్లా మైలవరంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తానా అద్యక్షుడు వేమన సతీష్ కడప జిల్లా రాజంపేటలో ఓటు వేశారు. సిలికానాంద్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మచిలీపట్నంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాట్స్ మాజీ అద్యక్షుడు మన్నవ మోహనకృష్ణ కంకిపాడులో ఓటు వేశారు. వైకాపా యువనాయకుడు యార్లగడ్డ శివరాం వైజాగ్ లో ఓటు వేశారు. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై తెదేపా ప్రతినిధి బొబ్బా గోవర్ధన్ అవనిగడ్డలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఫిలడెల్ఫియకు చెందిన ప్రవాసాంధ్రుడు మందలపు రవి హైదరాబాద్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అమెరికాతో పాటు వివిధ దేశాల నుండి తరలి వచ్చిన ప్రవాస ప్రముఖులు తమ స్వస్థలాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
nri nrt voters in 2019 elections
nri nrt voters in 2019 elections bobba govardhan
nri nrt voters in 2019 elections ravi mandalapu