Movies

22సినిమాలకు ₹200కోట్లు

sharukh sold off rights to 22cinemas

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తాను నటించిన సినిమాల్లోని 22 చిత్రాలకు సంబంధించిన శాటిలైట్‌ హక్కులను ఓ టీవీ ఛానల్‌కు అమ్మేశారట. ఈ మేరకు బాలీవుడ్‌లో వార్తలు వెలువడుతున్నాయి. రూ.200 కోట్లకు డీల్‌ కుదుర్చుకుని శాటిలైట్‌ హక్కులను అమ్మేసినట్లు తెలుస్తోంది. వాటిలో ‘స్వదేశ్‌’, ‘ఓం శాంతి ఓం’, ‘దిల్‌వాలే’, ‘ఫిర్‌ భీ దిల్‌ హై హిందుస్థానీ’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూఇయర్‌’, ‘డియర్‌ జిందగీ’, ‘పహేలీ’, ‘బిల్లూ’, ‘చమత్కార్’, ‘అంజామ్‌’, ‘రామ్‌ జానే’ చిత్రాలు ఉన్నాయట.