NRI-NRT

సాగినాలో Mi3 ఉగాది వేడుకలు

mi3 ugadi 2019 in saginaw

సాగినా, బే-సిటీ, మిడ్‌ల్యాండ్ ప్రాంతీయ తెలుగు సంఘం(Mi3) ఆధ్వర్యంలో శనివారం నాడు వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. డా.తోటకూర విద్యా, వేమూరి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డా.గింజుపల్లి శ్రీధర్ ప్రారంభోపన్యాసం చేశారు. స్థానిక ప్రవాసుల ప్రదర్శనలు అలరించాయి. తానా ప్రాంతీయ సమన్వయకర్త గింజుపల్లి మురళీ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.