Movies

చాలా సమయం వెచ్చిస్తున్నాను

kangana busy with direction

‘మణికర్ణిక’ విజయంతో జోరుమీదున్న కంగన ఇప్పుడు తన దృష్టంతా దర్శకత్వం మీదే పెట్టింది. దర్శకురాలిగా తన తొలి చిత్రం అదిరిపోయేలా ఉండాలని స్క్రిప్టు పనుల్లో పూర్తిగా తలమునకలై ఉంది. మరి ఆ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కబోతోందనే ప్రశ్నకు కంగన సమాధానం ఇచ్చింది. ‘‘దర్శకురాలిగా నా తొలి చిత్రాన్ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నాను. యాక్షన్‌ నేపథ్యం ఉన్న ఇతిహాస కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. దీని కోసం చాలా సమయం వెచ్చిస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాం. దాని తర్వాత ఫొటోషూట్‌ చేసి పోస్టర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’అని చెప్పింది కంగన. నాయికా ప్రాధాన్య చిత్రాలు భారీ విజయాలు అందుకుంటున్న తరుణంలో తను దర్శకురాలిగా అడుగుపెట్టడం ఎంతో సరైంది అంటోది కంగన. ఆమె నటిస్తున్న ‘పంగా’ చిత్రీకరణ త్వరలో కోల్‌కత్తాలో జరగనుంది. దీంతో పాటు ‘మెంటల్‌ హై క్యా’, జయలలిత బయోపిక్‌లోనూ కంగన నటిస్తోంది.