NRI-NRT

చంద్రబాబుకు తానా సభల ఆహ్వానం

chandrababu invited to tana 2019 conference

జులై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో జరగనున్న 22వ తానా మహాసభలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తానా అధ్యక్షుడు వేమన సతీష్ నేతృత్వంలోని బృందం సోమవారం నాడు ఆహ్వానం అందించింది. 2007లో బిల్ క్లింటన్ ముఖ్య అతిథిగా హాజరయిన డీసీ తానా మహాసభల్లో చంద్రబాబు కూడా పాల్గొన్న విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని, జులైలో ఆయన సమయానుకూలతను బట్టి 2019 సభల్లో పాల్గొనే అవకాశాలను పరిశీలిస్తానని హామీనిచ్చినట్లు వేమన సతీష్ తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, గారపాటి ప్రసాద్ తదితరులు ఉన్నారు.