NRI-NRT

చికాగో తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సర వేడుకలు

chicago telugu cta celebrates ugadi 2019

వికారినామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు చికాగో తెలుగు అసోసియేషన్‌(సీటీఏ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ దేవస్థానం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి 600మందికి పైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా గాంధీ-కింగ్‌ స్కాలర్‌షిప్‌ అవార్డులను ప్రదానం చేశారు. సీటీఏ డైరెక్టర్‌ సుజనా ఆచంట అతిథులను ఆహ్వానించి, తెలుగు భాష కోసం సీటీఏ చేస్తున్న సేలను, ఈ ఏడాదిలో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణంతోపాటూ, కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, ఉగాది పచ్చడి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుభద్రాచార్యులు శ్రీనివాసులు, డా.శారదా పూర్ణ సొంటి, ఆజాద్‌ సుంకవల్లిలకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి చికాగో స్టేట్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ స్కాట్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ల పేరు మీదుగా విద్యార్థులకు సీటీఏ స్కాలర్‌షిప్‌లను ఇవ్వడాన్ని అభినందించారు. ఈ ఏడాదికిగానూ మనస్వి తుమె, రిషితా వజ్జాల, స్పందన్‌ రామినేని, భాస్కరాచారిలకు స్కాలర్‌షిల్‌లను స్కాట్‌ అందజేశారు. సీటీఏ వ్యవస్థాపకులు రవి ఆచంట, ప్రవీణ్‌ మోటూరు, ప్రెసిడెంట్‌ నాగేంద్ర వేగె, బోర్డు సభ్యులు రావు ఆచంట, శేషు ఉప్పటపాటి, చుండు శ్రీనివాస్‌, అశోక్‌ పగడాల, శ్రీని యెరమాటి, వెంకట గ్యాజంగి, రాహుల్‌ వీరటపు, రాణి వేగె, సుజనా ఆచంట, అనిత గోలి, వ్యాపారవేత్త రమేశ్‌ తూము, దేవాలయ ట్రస్టీలు ఎమ్‌. రావు, హరినాత్‌ కోనేరు, ఆటా వ్యవస్థాపకులు హనుమంత్‌ రెడ్డి, తాతా ప్రకాశంలు విజేతలను ఘనంగా సన్మానించారు.