Business

బెంగుళూరు విమానాశ్రయ రేట్లు పెంపు

user charges hiked at bangalore airpport

బెంగళూరు విమానాశ్రయంలో రేపటి నుంచి యూజర్‌ ఫీజును 120 శాతం పెంచనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీ అయిన మూడో విమానాశ్రయం బెంగళూరే. కొత్తగా విధించే అదనపు ఫీజును విమానాశ్రయ విస్తరణకు ఉపయోగించున్నారు. ‘‘ఎయిర్‌పోర్టు ట్రాఫిక్‌ రెగ్యూలేటర్‌ ఏఈఆర్‌ఏ ఆదేశాలు ఏప్రిల్‌ 16నుంచి అమల్లోకి వస్తాయి. దేశీయంగా ప్రయాణాలను ప్రారంభించే వారు రూ.306 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీరి వద్ద నుంచి రూ.139 తీసుకొనేవారు. అంతర్జాతీయ ప్రయాణికులు రూ.1,226 చెల్లించాల్సి ఉంది. గతంలో వీరి వద్ద నుంచి రూ.558 వసూలు చేసేవారు. ఈ ఛార్జీల పెంపు విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రూ.13వేల కోట్లను సమకూర్చుకోవడంలో సాయం చేస్తుంది.’’ అని బెంగళూరు ఎయిర్‌పోర్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ లెక్కన దేశీయ ప్రయాణాలకు ఛార్జీలు 120శాతం, విదేశీ ప్రయాణాలకు ఛార్జీలు 119శాతం పెరిగినట్లు లెక్క.