Movies

చేయాల్సింది చాలా ఉంది

rashmika says this is just the beginning

‘‘చిత్ర పరిశ్రమలో అవకాశం ఎంత గొప్పదో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కీలకం’’ అంటోంది రష్మిక మందన్న. ‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయమైన ఈమె, వరుస విజయాలతో దూసుకెళుతోంది. విజయ్‌ దేవరకొండతో కలసి ‘గీత గోవిందం’లో సందడి చేసిన రష్మిక, త్వరలోనే మరోసారి అతనికి జోడీగా ‘డియర్‌ కామ్రేడ్‌’లో అలరించనుంది. అల్లు అర్జున్‌, నితిన్‌ చిత్రాల్లోనూ నాయికగా కనిపించనుంది. ‘‘అందరిలా అవకాశాల గురించి ఎదురు చూడాల్సిన అవసరం నాకు రాలేదు. అది నా అదృష్టం. అలాగని ఎప్పుడూ వృత్తి పట్ల అలసత్వం ప్రదర్శించలేదు. ప్రతి అడుగు అర్థవంతంగా ఉండేలా చూసుకుంటున్నా. ప్రతి పాత్రపైనా నాదైన ప్రభావం కనిపించాలని కష్టపడుతున్నా. నటిగా నాకిది ఆరంభమే. నేను చేయాల్సింది చాలా ఉంద’’ని అంది రష్మిక.