వేసవి సీజన్, వరుస సెలవులు రావడంతో తమిళనాడు నుంచే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే పర్యాటకులతో ఊటీ కిటకిటలాడుతోంది. ఊటీ ప్రభుత్వ బొటానికల్ పార్కును గత నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా పర్యాటకులు సందర్శించారు. అదే విధంగా, ఊటీ బోట్ హౌస్, ప్రభుత్వ రోజ్ పార్కు, దొడ్డబెట్ట కొండ శిఖరం, మరవియల్ పార్కు, ప్రైవేటు పార్కుల వద్ద పర్యాట కుల రద్దీ అధికంగా ఉంది. ఎండలు పెరిగే అవకాశ ముండడంతో వేసవి విడిద కేంద్రమైన ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు
ఊటీకి పోటెత్తుతున్న పర్యాటకులు

Related tags :