ScienceAndTech

టిక్‌టాక్ మాయం

tik tok removed from play store and app store on indian court ruling

గూగుల్ యాప్ స్టార్, యాపిల్ యాప్ స్టార్ నుంచి టిక్ టాక్ యాప్ తొలగింపు…! సాఫ్ట్‌వేర్ సంస్థ‌లు గూగుల్‌, యాపిల్‌లు త‌మ త‌మ యాప్ స్టోర్‌ల నుంచి ప్ర‌ముఖ సోష‌ల్ యాప్‌ టిక్‌టాక్‌ను తొల‌గించాయి. అసభ్య‌కర వీడియోల‌ను ప్ర‌మోట్ చేయ‌డ‌మే కాకుండా చిన్నారుల‌ను అప‌రిచిత వ్య‌క్తులు వేధింపులకు గురి చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతూ యాప్ టిక్‌టాక్‌ను నిషేధించాల‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సాఫ్ట్‌వేర్ సంస్థ‌లు గూగుల్, యాపిల్‌ల‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయా సంస్థ‌లు త‌మ యాప్ స్టోర్‌ల నుంచి టిక్‌టాక్‌ను తొల‌గించాయి. ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌ల‌లో టిక్‌టాక్ యాప్ క‌నిపించ‌డం లేదు. టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని గ‌తంలో మ‌ద్రాస్ హై కోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించిన విష‌యం విదిత‌మే. అయితే ఇదే విష‌యంపై స‌ద‌రు యాప్ డెవ‌ల‌ప‌ర్ బైట్‌డ్యాన్స్ టెక్నాల‌జీ సుప్రీంను ఆశ్ర‌యించింది. యాప్‌ను నిషేధించాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల‌ని కోరింది. కానీ అందుకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. దీంతో యాప్‌ను ప్లే స్టోర్‌, యాప్ స్టోర్‌ల నుంచి తొల‌గించాల‌ని గూగుల్‌, యాపిల్‌ల‌కు కేంద్రం లేఖ‌లు రాయ‌గా.. ఆ కంపెనీలు స్పందించి టిక్ టాక్‌ను యాప్ స్టోర్స్ నుంచి తొల‌గించాయి. కాగా ఈ కేసులో ఈ నెల 24న మ‌రోసారి కోర్టులో వాద‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి.