DailyDose

జెట్ ప్రయాణీకులను ఆదుకునేందుకు ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్లు-వాణిజ్యం-04/19

air india helping jet airways passengers with special offers

Ø కార్యాకలాపాల రద్దును నిరసిస్తూ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు గురువారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు.
Ø జెట్ ఎయిర్ వేస్ కార్యాకలాపాలు నిలిపివేయడంతో దిల్లీ, ముంబయి విమానాశ్రమాల్లో ఖాళీ అయిన 440 స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా వెల్లడించారు.
Ø జెట్ ఎయిర్ వేస్ కార్యాకలాపాల నిలిపివేతతో ప్రయాణం మధ్యలో చిక్కుకుపోయిన అంతర్జాతీయ ప్రయాణికులకు సాయం చేసేందుకు ఎయిర్ఇండియా ముందుకొచ్చింది. ప్రత్యేక ఛార్జీల ఆఫర్ ను ప్రకటించింది.
Ø జెట్ ఎయిర్ వేస్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు బిడ్లను దాఖలు చేయడానికి మే 10 వరకూ గడువు ఉంది. ఒక వేళ బ్యాంకులు ఏ బిడ్ ను అంగీకరించకపోతే దివాలా ప్రక్రియ మొదలయ్యే అవకాసం ఉంది.
Ø జెట్ ఎయిర్ వేస్ క్లియరింగ్ హౌస్ వ్యవస్థ సభ్యత్వాన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం (ఐటా) రద్దు చేసింది.దీంతో ప్రయానికుల రేఫండ్ ప్రక్రియ మరింత జాప్యం కావోచు.
Ø రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) జనవరి-మార్చి త్రైమాసికానికి రూ. 10362 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో కంపనీ ఏకీకృత నికర లాభం రూ. 9438 కోట్లుగా నమోదైంది.
Ø మదుపర్లు లాభాల స్వీకారానికి మొగ్గుచూపడంతో సూచీలు జీవనకాల గరిష్టాల నుంచి వెనక్కి వచ్చాయి.
Ø నేటి డాలరు మారకం విలువ రూ. 69.35