Sports

నేను ఊహించలేదు

parthiv patel says he did not expect dhoni to let go the last ball

ధోనీ ఆఖరి బంతిని వదిలేస్తాడని ఊహించలేదని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం అయ్యాయి. క్రీజులో ఉన్న ధోని అప్పటికే 24 పరుగులు కొట్టాడు. చివరి బంతి బ్యాట్‌కు తగల్లేదు. సింగిల్‌ తీసే ప్రయత్నంలో శార్ధుల్‌ ఠాకూర్‌ను పార్థివ్‌ పటేల్‌ రనౌట్‌ చేశాడు. దీంతో బెంగళూరు ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే, మంచి ఊపు మీదున్న ధోనీ చివరి బంతిని వదిలేస్తాడని అనుకోలేదని తెలిపాడు. అనుకోకుండా ధోనీ ఆ బంతిని వదిలేశాడని తెలిపాడు. ఆఫ్‌సైడ్‌ బంతులు వేసి ధోనీని ఔట్‌ చేయాలని అనకున్నామని పార్థివ్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు కోచ్‌ గ్యారీతో మాట్లాడినప్పుడు.. ‘మీ జట్టు బౌలర్ల మీద ఆందోళన అవసరం లేదు. కాకపోతే పరిస్థితులను బట్టి బౌలర్లను ప్రయోగించాలని అన్నారని’ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ తెలిపాడు. అయితే, ఆర్సీబీ తరఫున ఓపెనింగ్‌ స్థానంలో వచ్చి రాణిస్తుండటం ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో పార్థివ్‌ పటేల్ 53(37బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.