Fashion

పూలసొక్కా సొగసు సూడతరమా?

flower shirt fashion trends for summer men

యువతంతా ఒక్కసారిగా పూలరంగళ్లై పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడిదే ట్రెండ్‌. పార్టీ, పబ్‌, నైట్‌అవుట్‌, ఫంక్షన్లకే కాదు.. ఆఫీసులకు ఇవే ఈ పూల షర్ట్స్‌ ధరిస్తున్నారు. మార్కెట్లో అన్ని దుస్తుల దుకాణాల్లో పూల చొక్కాలదే సందడి. ప్లెయిన్‌ లైట్‌ కలర్‌ ప్యాంట్‌పై… ఈ చొక్కాలు వేసి మెరిసిపోతున్నారు. అటు ఫార్మల్‌గానూ, ఇటు కాజువల్‌గానూ ఇవి సరిపోతుండటంతో ఎక్కువగా వీటినే కొంటున్నారు. అసలే దసరా, దీపావళి… ఆపై క్రిస్మస్‌, నూతన సంవత్సరాది… వరుస పండగల కాలం కావడంతో డిజైనర్లు ఈ మోడళ్లలోనే భిన్నమైన వాటిని రూపొందించి మార్కెట్లో దించుతున్నారు. యువతని పూలల్లో ముంచుతున్నారు.