Movies

ఎప్పుడూ చూడనివి ఉంటాయి

puja hegde speaks about her new movie with prabhas

తాను ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు సినీ నటి పూజా హెగ్డే. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌, పూజా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి పూజా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్‌ పూర్తిచేశాం. మిగతా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని అంశాలను వెండితెరపైకి తీసుకురాబోతున్నాం. యూరోపియన్‌ పీరియడ్‌ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు. ప్రభాస్‌తో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. ఇప్పటివరకు నేను అంతటి మంచి మనిషిని ఎప్పుడూ చూడలేదు. అంత గొప్ప స్టార్‌ అయివుండి కూడా ఎంతో మర్యాదగా, పద్ధతిగా ఉండటం చూసి ముచ్చటేస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి ‘అమూర్‌’ అనే ఫ్రెంచ్‌ టైటిల్‌ని అనుకుంటున్నట్లు చిత్రవర్గాలు అంటున్నాయి. పూజా మరోపక్క బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.