ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్’ అని విమర్శించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాందీ… సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ట విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు. కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల వేడిలోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తన వ్యాఖ్యలను వ్యతిరేక పార్టీలు వారికి అనుకూలంగా మలచుకున్నాయని అన్నారు. ఈ పదాన్ని చాలామంది విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. రాఫెల్ కేసులో తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన రివ్యూపిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాహుల్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ కేసు రేపు విచారణకు రానుంది.
వేడిలో అనేశాను – క్షమించండి
Related tags :