Food

వేసవిలో చెరకు రసం తాగితే అద్భుతః

sugarcane juice soothes in summer

వేసవి తాపం తీర్చే వాటిలో చెరకురసం ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే ఈ పానీయానికి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి.

* ప్రధానంగా వేసవిలో డీహైడ్రేషన్‌కు గురైనపక్షంలో తక్షణ శక్తి కోసం ఓ గ్లాసు చెరకు రసాన్ని సేవించినట్టయితే త్వరగా కోలుకుంటారు.
* కడుపునిండా ఆరగించిన ఆహారం జీర్ణంకాకుండా ఉన్నట్టయితే, ఓ గ్లాస్ చెరకు రసాన్ని తీసుకుంటే క్షణాల్లో జీర్ణమైపోతుంది.
* చెరకు రసాన్ని స్పోర్ట్స్ డ్రింక్‌గా ఉపయోగిస్తారు. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం ఎలక్ట్రొలైట్లు చెరకు రసంలో పుష్కలంగా ఉంటాయి.
* చెరకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు కూడా ఈ రసాన్ని తాగొచ్చు.
* చెరకు రసంలోని ఫినాల్, ప్లేవనాల్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.