Agriculture

పశుసంపద ఉన్న రైతులు ఎల్లప్పుడు సమృద్ధిగా ఉంటారు

venkaiah naidu says veterinary science should reinvent itself in tirupati

జనాభా పెరిగే కొద్దీ దేశంలో అవసరాలు పెరిగిపోతున్నాయనీ, ఆహారశైలిలో వస్తున్న మార్పులు ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలోని పశువిశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొత్తగా తీసుకొచ్చే సంస్కరణలు.. భవిష్యత్తు సమస్యలకు సమాధానాలవుతాయని అన్నారు. పశుసంపద ఉన్న ఏ రైతూ ఆత్మహత్య చేసుకోలేదని సర్వేలు నిగ్గు తేల్చాయని చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మారేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. ‘ ఒకప్పుడు పశు సంపద ఉంటేనే ఇళ్లు కళకళలాడేది. పంట నష్టం వచ్చినా.. పశుసంపద ఆసరాగా నిలిచేది. విష్ణు అవతారాలు, దేవుళ్ల వాహనాలు అన్నీ పశుపక్ష్యాదులే. మన సంస్కృతిలోనే వేల ఏళ్లుగా పశుసంపద భాగంగా ఉంది’ అని వెంకయ్యనాయుడు అన్నారు. పశువైద్య విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఉత్నతస్థాయి ప్రమాణాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఐదు విషయాలు గుర్తుంచుకోవాలన్న ఉపరాష్ట్రపతి..జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరును, మాతృభాషను, మాతృదేశాన్ని, విద్య నేర్పిన గురువును ఎప్పటికీ మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు.