Movies

కస్తూరి రిటర్న్స్

actress kasthuri as police officer in second innings

సౌత్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న మాస్‌, కమర్షియల్‌ చిత్రం ‘ఇ.పి.కో 302’. ఇందులో దుర్గా ఐపీఎస్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిణి పాత్రను పోషిస్తోంది కస్తూరి. హీరోకు సమానమైన పాత్రలో ఆమె నటించినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాగశక్తి, వర్షితలు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. వయ్యాపురి, బోండామణి, విన్స్‌కుమార్‌ తదితరులు నటిస్తున్నారు. అలెక్స్‌పాల్‌ సంగీతం సమకూర్చారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు సమకూర్చి దర్శకత్వం వహించారు సలంగై దురై. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం కోలాహలంగా జరిగింది. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ ఇదో క్రైం, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం. కస్తూరి పోలీసు ఆఫీసరుగా బాధ్యతలు తీసుకున్న ప్రాంతంలో మూడు హత్యలు చోటుచేసుకుంటాయి. దారుణమైన ఆ నేరం వెనుకున్న హంతకులను ఎలా పట్టుకున్నారన్నదే ప్రధాన కథ. మరోవైపు తమ ప్రేమకు తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని, వారి నుంచి తమను రక్షించాలని కోరే ఓ ప్రేమ జంట.. కథలో కీలకంగా మారుతుంది. పలు ఆసక్తికరమైన అంశాలతో కథ నడుస్తుంది. కస్తూరి పాత్ర ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. ఈ సినిమాను రూపొందిస్తున్నప్పుడే ఇదే బ్యానరుపై ‘ఎదిర్‌వినై’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించా. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అందరూ కొత్తవారే నటించారని’’ పేర్కొన్నారు.