WorldWonders

మా నాన్నకు బెయిలు – మాకు ముప్పు

Amruta Varshini Says Bail To MaruthiRao Puts Them In Danger

మారుతీరావు కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిసి వారికి బెయిల్‌ మంజూరు చేయడం సరికాదని ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన భర్తను హత్య చేయించిన వారికి బెయిల్‌ మంజూరు కావడం మారుతీరావు కుమార్తెగా కంటే తనకు ప్రణయ్‌ భార్యగా వచ్చిన గుర్తింపే సంతృప్తినిచ్చిందని అమృత చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ప్రణయ్‌ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ.మారుతీరావు, ఇతర నిందితులు బయటకు వస్తే తమకు హాని ఉందంటూ కోర్టుకు తెలియజేశామన్నారు. ప్రణయ్‌ హత్య కేసు నిందితుల్లో ముగ్గురికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ దానికి సంబంధించిన పత్రాలు అందకపోవడంతో వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి శనివారం వారు విడుదల కాలేదు. ఆదివారం విడుదల కావచ్చని తెలుస్తోంది.