WorldWonders

కోహినూర్ కేసు కొట్టేసిన సుప్రీం

Indian Supreme Court Says It Cannot Stop The Auction Of Kohinoor in UK

అత్యంత విలువైన, అపురూపమైన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి రప్పించే విషయంలో దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. భారత్‌కు చెందిన కోహినూర్‌ వజ్రం ప్రస్తుతం బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అది భారత్‌ ఆస్తి అని దానిని తిరిగి రప్పించాలని కోరుతూ 2017లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. వేరే దేశం అధీనంలో ఉన్న వజ్రాన్ని రప్పించేందుకు తాము ఆదేశాలు జారీ చేయలేమని తీర్పునిస్తూ ఆ పిటిషన్‌ను 2017 నవంబర్‌లో సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ తాజాగా దాఖలైన మరో పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. నిజానికి 108 కారెట్ల కోహినూర్‌ వజ్రం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో లభ్యమైంది. అనంతర పరిణామాల్లో అది ఈస్ట్‌ ఇండియా చేతుల్లోకి వెళ్లింది. అక్కడి నుంచి బ్రిటన్‌కు చేరింది. ఇప్పుడు న్యాచురల్‌ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 2017లో దాఖలైన పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు ఈ వజ్రం విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. బ్రిటిష్ వారు ఆ వజ్రాన్ని దొంగిలించలేదని, బలవంతంగానూ లాక్కోలేదని తెలిపింది. పంజాబ్‌ను పాలించిన నాటి పాలకులు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఇచ్చారని, అక్కడి నుంచి అది బ్రిటన్‌కు చేరుకుందని తెలిపింది.

The Supreme Court has given the legal burial to a case which had sought judicial intervention to reclaim the 108-carat Kohinoor diamond from the United Kingdom. A five-judge bench headed by Chief Justice Ranjan Gogoi dismissed a curative petition seeking to re-examine its 2017 verdict in which it had said that it cannot pass order for reclaiming Kohinoor diamond from the UK or to stop it from being auctioned. The 108-carat Kohinoor gem, which fell into British hands during the colonial era, is the subject of a historic ownership dispute and claimed by at least four countries including India. “We have gone through the curative petition and the connected papers. In our opinion, no case is made out within the parameters indicated in the decision of this court in the case of Rupa Ashok Hurra vs. Ashok Hurra & another….Hence, the curative petition is dismissed,” said the bench, also comprising Justices SA Bobde, NV Ramana, DY Chandrachud and SK Kaul, in its recent order.