DailyDose

శ్రీనివాసరెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలి-నేరవార్తలు-04/30

hazipur srinivasa reddy encounter

Ø ముగ్గురు అమ్మాయిలను నమ్మించి హత్య చేసిన హాజీపూర్ గ్రామానికి చెందినా నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం నాడు అతని ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు

Ø బద్వేల్ లో ఒక వ్యక్తీ తీసుకున్న అప్పు చెల్లించలేదనే సాకుతో వడ్డీ వ్యాపారస్తుడు ఆ ఇంట్లో ఉన్న మహిళలను పిల్లలను బయటకు పంపి గృహాన్ని స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది

Ø తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన డిఎంకే నేత స్టాలిన్

Ø హాజీపూర్ బావిలో ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడంతో ఇంకా ఏమన్నా ఉన్నాయేమోనన్న అనుమానంతో పోలీసులు ఆ బావిని జల్లెడ పడుతున్నారు

Ø తమిళనాడులోని ముత్తుట్ మినీ ఫైనాన్స్ కంపనీలో 2 కోట్లు దోపిడీ జరిగింది

Ø పాగో జిల్లా విస్సాకోడేరులో ఒక యువతిని గుర్తుతెలియని కారులో కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది

Ø గద్వాల సమీపంలోని జింకలపాడు వద్ద ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గు వ్యక్తులు మృతిచెందారు

Ø జస్టిస్‌ నూతి రామ్మోహన్‌ రావు కుమారుడు వశిష్టపై ఆయన భార్య సింధూ శర్మ తరపు బంధువులు దాడి జరిపారు

Ø ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో కల్తీ సారా తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.