DailyDose

గాడిద పాలు లీటరు వెయ్యి రూపాయిలు-తాజావార్తలు-04/30

donkey milk on sale now

Ø అందానికి ఆరోగ్యానికి గాడిద పాలు మంచివని ప్రచారం జరుగుతుండడంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాడిద పాలు లీటరు వెయ్యి రూపాయిలకి అమ్ముతున్నారు

Ø బంగాళదుంపల పంట పైన తమకే హక్కులు ఉన్నాయని రైతులు ఎవరైనా బంగాళదుంపలు పండిస్తే పెప్సీ కంపనీ కోర్టులో కేసులు వేస్తుందని రైతులు వాపోతున్నారు

Ø ఫొని తుఫాను ఉత్తరాంధ్రను దాటి ఒడిస్సా తీరం వైపు ప్రయాణం సాగిస్తుంది

Ø ప్రముఖ మలయాళీ హీరొయిన్ నిత్యామేనన్ వ్యవహార శైలి బాగోలేదని ఆమెను సినిమాల్లో పాత్రలు ఇవ్వకూడదని మలయాళీ నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం

Ø తెలంగాణాలో ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా మే 2వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు

Ø పాకిస్థాన్ జైళ్లలో బందీలుగా ఉన్న 55 మంది మత్స్యకారులను 5 గురు పురులను ఆ దెస ప్రభుత్వం విడుదల చేసింది

Ø రాహుల్ గాంధీ పౌరసత్వంపై రగడ రేగడంతో కేంద్ర హోంశాఖా ఆయనకు నోటీసులు ఇచ్చింది

Ø పుదుచ్చేరి పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మద్రాస్ హైకోర్ట్ కిరణ్ బేడికి షాక్ ఇచ్చింది

Ø తెలంగాణా సిఎం క్యాంప్ ఆఫీసును ముట్టడించడానికి ప్రయత్నించిన మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు