Videos

ఈ బుడ్డోడి తబలా వింటే తన్మయత్వమే!

This Four Year Old Odiya Kids Tabla Skills Are At Next Level

నాలుగేళ్లు కూడా లేని ఓ చిన్నారి ఒడియా సినిమాలోని పాటను అవలీలగా పాడేస్తున్నాడు. అంతేనా అందుకు అనువుగా తబలా కూడా వాయించేస్తున్నాడు. పాటకు, తను వాయించే తబలాకు అనుగుణంగా హావభావాలు కూడా పలికిస్తున్నాడు. ఈ చిన్నారి ఎంతో క్యూట్‌గా పాడుతున్న ఈ వీడియో ఒడియా గాయని సోనా మహాపాత్ర కంట్లో పడింది. తాను ఆలపించిన ఒడియా చిత్రం ‘ఫక్రే’ అనే చిత్రంలోని పాటనే ఆ చిన్నారి కూడా పాడుతున్నాడు. దీంతో ఈ చిన్నారిలో ఉన్న ప్రతిభను మెచ్చుకుంటూ ట్విటర్‌లో షేర్ చేసింది. దీంతో ఇది పాగా వైరల్‌ అవుతోంది. సంగీతం గురించి అర్థం చేసుకోలేని చిన్నారి పాటలను అవలీలగా పాడుతున్నాడని, సంగీత విద్వాంసుడిలాగా తబలా వాయిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.