కొండచిలువలు పెద్ద పెద్ద జంతువులను మింగడం చూశాం. కానీ ఇందుకు భిన్నంగా పెద్ద పామును ఓ చిన్న కప్ప మింగేసింది. కృష్ణా జిల్లా రామన్నపేటలో జరిగిన ఈ వింత ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చందర్లపాడు మండలం, రామన్నపేట గ్రామంలో రెండడుగుల కొండచిలువను కప్ప మింగేసింది. అయితే ఆ తర్వాత ఖాళీ లేకపోవడంతో పాము సగభాగం బయటే ఉండిపోయంది. దీంతో సగం లోపల, సగం బయట ఉండిపోయిన కొండచిలువ గిలగిల కొట్టుకుంది. తప్పించుకునేందుకు పాము విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ వింతను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆ పాము కృష్ణా జిల్లా కప్పతో పెట్టుకుంది – మటాష్ అయిపోయింది!
Related tags :