WorldWonders

నేపాల్ విమానాశ్రయంలో లక్ష డాలర్లు పట్టివేత

100000 USD Caught In Nepal Airport From Indian Lady

లక్ష అమెరికన్‌ డాలర్లను అక్రమంగా తరలిస్తున్న వందన సోని అనే 44 ఏళ్ల భారత మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది తనిఖీ చేస్తుండగా విషయం బయటపడింది. సాధారణంగా ఒక వ్యక్తి 5 వేల అమెరికన్‌ డాలర్లను తనతోపాటు తీసుకెళ్లే వీలుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇంత మొత్తంలో నగదును తీసుకెళ్లడంతో ఆమెను అరెస్టు చేసినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కేందుకు బోర్డింగ్‌ పాయింట్‌కు వస్తుండగా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. డాలర్లను తన హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎవరికీ కనిపించకుండా దాచినట్లు పోలీసులు గుర్తించారు.