Movies

లక్ష్మీస్ NTR దెబ్బకు కడప జాయింట్ కలెక్టర్ బదిలీ

Kadapa Joint Collector Koteswara rao Transferred Over Lakshmis NTR Movie

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని కడప జిల్లాలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)పై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఆ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని థియేటర్లలో చిత్రం ప్రదర్శించడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జేసీ కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని విధుల్లో ఆయన్ను నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 19 వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను విడుదల చేయొద్దని మరోసారి ఈసీ స్పష్టం చేసింది.