DailyDose

నేటి ఏపీ అసెంబ్లీలో మాటల తూటాలు-TNI కధనాలు

Andhra Assembly Round Up Today - July 19 2019

1. బాబుకు కౌంటర్: అవసరం లేకున్నా ఎక్కువ రేటుకు కొన్నారు: పీపీఏలపై జగన్.
అవసరం లేకున్నా ఎక్కువ రేటుకు విద్యుత్‌ను గత మూడేళ్లలో చంద్రబాబునాయుడు సర్కార్ కొనుగోలు చేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో పీపీఏలపై చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కౌంటరిచ్చారు.అవసరం లేకున్నా కొందరికి ప్రయోజనం కల్గించేందుకు చంద్రబాబునాయుడు సర్కార్ అప్పట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు.గత మూడేళ్ల నుండి ఏపీ ప్రభుత్వం రూ. 2635 కోట్లను అధికంగా చెల్లించందని జగన్ గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజనాకు నష్టం వాటిల్లిందని చెప్పారు.2017- 18 లో 9 శాతం కొనుగోలు చేయమంటే 19 శాతం కొనుగోలు చేశారని, 2018-19 లో11 శాతం అంటే 23.4 శాతం కొనుగోలు చేశారని జగన్ గుర్తు చేశారు. 2019లో 5 శాతం విద్యుత్ ను కొనమంటే 5.59 శాతం కొనుగోలు చేశారని జగన్ చెప్పారు. నిపుణుల కమిటీ రాకముందే డిస్కం అధికారులపై చంద్రబాబునాయుడు తన అక్కసును వెళ్లగక్కుతున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు.
థర్మల్ పవర్ తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నా కూడ విండ్ పవర్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
2. ఒప్పందాలను ఉల్లంఘిస్తే చర్యలు: బొత్స
రాజధాని పరిధిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు భూ కేటాయింపులపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనే మూడు ప్రైవేటు యూనివర్సిటీలకు 200 ఎకరాల చొప్పున భూమి కేటాయించారని తెలిపారు. ఎకరాకు 50 లక్షల చొప్పున ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఫీజు రాయితీలు, రిజర్వేషన్లు పాటించని సంస్థలకు ప్రభుత్వం భూములు ఇవ్వటం సరికాదని ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, శ్రీనివాసరెడ్డి, బాలసుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. త్యాగం చేసిన రైతుల భూములను ఇంత తక్కువకు ఎలా ఇస్తారని నిలదీశారు. ప్రభుత్వ సంస్థలు రాజధాని ప్రాంతంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే ఒప్పందంలో ఉన్న ప్రకారమే ఆ యూనివర్సిటీలు నడుస్తాయని… దాన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించామన్న మంత్రి… దానిని ఉచితంగా ఇవ్వాలని యూనివర్సిటీ చేసిన విజ్ఞప్తి పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
3. రైతు ఆత్మహత్యలపై వాడివేడి చర్చ
ఏపీలో రైతు ఆత్మహత్యలపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. 2014 -2019 మధ్య కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. 1360 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో 420 మందికి పరిహారం ఇచ్చినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. మిగతా వారికి తమ ప్రభుత్వం తరుపున ఏడు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆ సమయంలో తెదేపా ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్ర ప్రసాద్ లేచి.. వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. 30 పార్టీలు మారిన వెల్లంపల్లి జోక్యం ఎందుకని వైవీబి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించటంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అయితే రైతులందరికీ న్యాయం చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఆత్మహత్యలు లేకుండా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
4. డిస్కంలను నష్టాల బాట పట్టించారు: జగన్‌
విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) మనకు మార్గదర్శకాలు ఇస్తుందని సీఎం జగన్‌ అన్నారు. తెదేపా హయాంలో ఈఆర్‌సీ చెప్పిన దానికంటే ఎక్కువగా విద్యుత్‌ను కొనుగోలు చేశారని చెప్పారు. 2015-16లో 5 శాతం కొనుగోలు చేయాలని ఈఆర్‌సీ చెబితే దానికంటే ఎక్కువగానే కొన్నారని జగన్‌ విమర్శించారు. శాసనసభలో పీపీఏల అంశంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. 2017-18లో 9 శాతం కొనుగోలు చేయాలంటే 19 శాతం.. 2018-19లో 11 శాతం చేయమంటే 23.4శాతం కొన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిసీ అలా చేయడం మంచి పద్ధతా? అని జగన్‌ ప్రశ్నించారు. అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ఏరకంగా నష్టాలు వస్తాయో వాళ్లకు తెలిసినా ముందుకెళ్లారని తెదేపాను ఉద్దేశిస్తూ ఆయన ఆరోపించారు. పవన విద్యుత్‌ కోసం యూనిట్‌ ఏకంగా రూ.4.84కు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు.
5. నాపై బురద జల్లితే… మీపైనే పడుతుంది: పీపీఏలపై బాబు……..
విద్యుత్ కొనుగోళ్లపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. పీపీఏలపై నిజానిజాలు వక్రీకరించారంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగంలో రెగ్యులేటరీ కమీషన్ తీసుకొచ్చింది టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంక్షోభాన్ని నివారించడంతో పాటు భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచుకుండా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఇదే సందర్భంలో జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీకి కర్ణాటక ప్రభుత్వం రాసిన లేఖను చంద్రబాబు సభలో ప్రస్తావించారు.జగన్ కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్నారని.. డెవలపర్‌గా ఆయనకు ఎక్కువ డబ్బులు కావాలన్నారు. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుందని.. పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేటుకే మీరు కరెంట్ కొంటున్నారని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు.వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ హయాంలో జరిగిన పీపీఏల ఒప్పందంపై ఐదేళ్ల పాటు సమీక్షలు జరిపి చివరకు ఆయనే క్లీన్ చీట్ ఇచ్చారని బాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 137 అవార్డులు వచ్చాయని.. విద్యుత్ శాఖను కుప్పకూల్చొద్దని చంద్రబాబు హితవు పలికారు.
6. రాజీనామా చేస్తా: అసెంబ్లీలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలనం……..
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తానని శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.
శుక్రవారం నాడు అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఈ విషయమై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అన్నా రాంబాబు కు మంత్రి అనిల్ కుమార్ కూడ మద్దతుగా నిలిచారు. ఈ విషయమై చర్చ జరగాలని ఆయన కూడ అభిప్రాయపడ్డారు.అయితే ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయమై సభా నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకొందామని ప్రకటించారు. దీంతో రాంబాబు మెత్తబడ్డారు.
7. రాజీనామా చేస్తా: అసెంబ్లీలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలనం……..
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తన పదవికి రాజీనామా చేస్తానని శుక్రవారం నాడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు.
శుక్రవారం నాడు అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చ జరగకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఈ విషయమై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హాయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అన్నా రాంబాబు కు మంత్రి అనిల్ కుమార్ కూడ మద్దతుగా నిలిచారు. ఈ విషయమై చర్చ జరగాలని ఆయన కూడ అభిప్రాయపడ్డారు.అయితే ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయమై సభా నాయకుడితో చర్చించి నిర్ణయం తీసుకొందామని ప్రకటించారు. దీంతో రాంబాబు మెత్తబడ్డారు.
8. పోలవరంలో దోపిడి.. ఇంకో 20 రోజులే,అన్ని బయటపడతాయి: జగన్………..
పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ అసెంబ్లీలో భారీ చర్చ జరిగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పరిణామంతో సభలో గందరగోళం నెలకొంది.దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు గోదావరిలో వరదలు వస్తాయని తెలిపారు. అయితే టీడీపీ ప్రభుత్వం స్పీల్‌వేను పక్కనబెట్టి.. కాపర్ డ్యాం నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని జగన్ గుర్తు చేశారు.నవంబర్‌లో పనులు ప్రారంభించి 2021 జూన్ నాటికి నీళ్లిస్తామని జగన్ స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల దాదాపు 15 శాతం వరకు నిధులు మిగులుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.సబ్ కాంట్రాక్ట్‌ల ముసుగులో బంధువులు, అనుచరులకు పనులు కట్టబెట్టారని.. యనమల వియ్యంకుడికి సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చారని, కానీ ఇంతవరకు పనులు మొదలు కాలేదని జగన్ ఎద్దేవా చేశారు.ఏం జరగకుండానే రూ.724 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని జగన్ ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 15, 20 రోజుల్లో అన్నీ బయటకు వస్తాయని సీఎం వెల్లడించారు.
9. టీడీపీ నేతల ఆందోళన… స్పీకర్ అసహనం……..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పోలవరం పై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కాగా…. టీడీపీ నేతల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా… సభ ప్రారంభం కాగానే.. పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికార పక్షం పట్టించుకోలేదు. పోలవరంపై చర్చకు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా… వారు ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.‘‘మీరంతా సీనియర్ మెంబర్స్, ఒక ప్రశ్నను ఎంతసేపు లాగుతారు? ఎంతకీ తృప్తి చెందకపోతే ఏ ప్రభుత్వం కూడా రిప్లై ఇవ్వలేదు. మిగిలిన సభ్యుల సమయాన్ని మీరు వృథా చేస్తున్నారు. కాబట్టి నేను అన్నివేళలా ఇటువంటి వాటికి అనుమతి ఇవ్వను’’ అంటూ టీడీపీ సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవద్దని హితవు పలికారు. అయినా… టీడీపీ నేతలు వినిపించుకోకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది.
10. తప్పుడు సంకేతాలతో వైకాపా మభ్యపెడుతోంది-శాసనసభలో చంద్రబాబు
విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ తెచ్చింది తెదేపానే అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సంస్కరణలు తెదేపా ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గతంలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఉంటే పూర్తిగా దాన్ని రూపుమాపామని చెప్పారు. కానీ, ప్రస్తుతం మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నానని, వైకాపా సభ్యులు తప్పుడు సంకేతాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పీపీఏలపై వైకాపా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చంద్రబాబు చెప్పారు. ‘కర్ణాటకలో జగన్‌కు డెవలపర్‌గా ఎక్కువ ధర కావాలట. ఇక్కడ మన రాష్ట్రానికి మాత్రం అవసరం లేదా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కర్ణాటక విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ భవానీ ప్రసాద్‌ ఇచ్చిన కాపీని సభలో చదివి వినిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సమాధానం ఎవరు చెప్పాలని ప్రశ్నించారు.కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఆరోపణలు చేసేముందు జగన్‌ కూడా ఒకసారి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైకాపా కాదా? అని ప్రశ్నించారు.
11. ఎంత దోచారో 15 రోజుల్లో బయటికొస్తాయ్‌ …
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత మూడు రోజులుగా చర్చ జరుగుతూనే ఉందని, సభలో ప్రతి రోజూ జలవనరుల మంత్రి ఈ అంశంపై చర్చిస్తూనే ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు అంతా కుంభకోణాల మయమైందని ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇటీవలే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చానని, నాలుగు నెలలుగా పూర్తిగా పనులు ఆగిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నవంబర్‌ నాటికి ప్రారంభించి 2021 జూన్‌ నాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.బిడ్డింగ్‌లో ఎవరు ఎంత తక్కువకు కోట్‌ చేస్తారో వాళ్లకే అప్పగిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిధులపై రీ బిడ్డింగ్‌ వేస్తే రూ.6,500 కోట్ల పనుల్లోనే 15 నుంచి 20 శాతం మధ్య మిగిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నట్లు జగన్‌ అసెంబ్లీలో వెల్లడించారు. ‘‘ నామినేషన్‌ పద్ధతిలో ఇష్టమొచ్చిన గుత్తేదారును తీసుకొచ్చారు. యనమల వియ్యంకుడు కూడా సబ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు.ఎంతటి దారుణమైన కుంభకోణాలు జరుగుతున్నాయో చూశాం. పనులు ప్రారంభించకుండానే రూ.724 కోట్లు అడ్వాన్స్‌ కింద కట్టబెట్టారు. పోలవరంలో ఎంత దోచారో మరో 15 రోజుల్లో బయటికొస్తాయి. ఈ ప్రాజెక్టు విపరీతమైన కుంభకోణాలతో నిండిపోయింది’’ అని సీఎం జగన్‌ ఆరోపించారు.మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు కొనుగోలు చేశారు …??