DailyDose

ఉమాపై విరుచుకుపడిన వసంత-తాజావార్తలు-11/14

Vasantha Fires On Devineni Uma-Telugu News Roundup Today-Nov 14 2019

*వైకాపా నేతలు పార్ధసారధి వసంత కృష్ణప్రసాద్ నేడు సీపీని కలిసారు. తెదేపా తప్పుడు చార్జి షీట్ పై కేసు నమోదు చేయాలని సీపీని కోరామని తెలిపారు. డీజీ స్థాయి అధికారితో విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ఇసుక అక్రమంగా తరలించామని తేలితే తమపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు కోరారు. దేవినేని ఉమా ఇసుకసురుడని దొంగ ఉమాను పక్కన పెట్టుకుని దీక్ష చేసి ప్రాంగనని భ్రస్టు పట్టించారని విమర్శించారు.
* వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బాల్సోనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రెజిల్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు గణతంత్ర వేడుకలకు హాజరుకావడానికి బ్రెజిల్‌ అధ్యక్షుడు అంగీకరించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
* జగిత్యాల జిల్లా ధర్మపురిలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు.
* కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రము లోని అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాలలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు సందర్బంగా ప్రభుత్వం ఏటా నిర్వహించే చిల్డ్రన్స్ డే వేడుకలను విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు .పట్టణం లోని జీవాదన్ స్కూల్ లో .నెహ్రు చిత్రపటానికి పూలు వేసి నెహ్రు చేసిన పలు అభివృద్ధి పనులను విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలియజేసినారు .చిల్డ్రన్స్ డే సందర్బంగా విద్యార్థులు దేశసేవకుల వేషధారణలతో తయారై పట్టణ వాసులను ఆకర్షింపజేశారు ..
* భారత తొలి ప్రధాని జావర్ లాల్ నెహ్రు గారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు .
* ఇసుక వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం లోని లక్కవరం గ్రామంలో ఇసుక రీచ్ లను తహసిల్దార్ సుమతి ప్రారంభించారు
* కూకట్పల్లి ఆరవ ఫేస్ లో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బోంతు రామ్మోహన్
* గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకున్న అడపా రవి కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. అడపా రవి కుటుంబానికి లక్ష రూపాయిల ఆర్థిక సహాయం నారా లోకేష్ అందించారు.
* వరంగల్ రురల్ జిల్లా నర్సంపేట డివిజన్ లోని వ్యవసాయ పట్టా పాస్ బుక్ లను ఆర్డీఓ రవి ,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టా పాస్ బుక్కులను రైతులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందించారు
* జోగులంబ గద్వాల జిల్లా. జిల్లా కేంద్రం లోని బాల భవన్ లో మహిళ, శిశు, దివ్యంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ అద్వర్యం లో బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ సరోజమ్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్, asp కృష్ణ లు పాల్గొన్నారు.
*నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు.
*రాష్ట్ర గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరిచందన్‌ గైట్‌ కళాశాల ప్రాంగణానికి గురువారం వస్తున్నట్టు చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ చైతన్యరాజు తెలిపారు.
*విశాఖ మన్యంలో చలి ప్రజలను వణికిస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మంచు దట్టంగా కురుస్తోంది.
*విశాఖ మన్యంలో చలి ప్రజలను వణికిస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మంచు దట్టంగా కురుస్తోంది.
*బ్రిక్స్ 11వ శిఖరాగ్ర సదస్సు వేదికగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
*రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
*దీర్ఘకాలిక ప్రణాళికతో అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారు.
*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు స్కూళ్లకు కొత్తరూపు తెచ్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 45వేల బడుల్లో తొలిదశలో 15వేల 715 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు దీనిని అమలుచేస్తున్నారు.
*శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతేడాది సెప్టెంబర్లో సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీం.
అనాదిగా ఉన్న ఆనవాయితీని అత్యున్నత న్యాయస్థానం మార్చడంపై కేరళ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
*దేశంలోనే అత్యంత సున్నితమైన అయోధ్య కేసు తీర్పును శనివారం వెలువరించింది సుప్రీం కోర్టు. మరో మూడు కీలక కేసులపై అత్యున్నత న్యాయస్థానం నేడు తుది నిర్ణయం తీసుకోనుంది.
*చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, కళలు, వృత్తులు, సంస్కృతిని నేటి తరానికి తెలియజెప్పేందుకు ఈనెల 24వ తేదీన కోఠిలోని హస్మత్ గంజ్ గేట్ నుంచి ఉమెన్స్ కళాశాలలోని బ్రిటీష్ రెసిడెన్సీ వరకు హెరిటేజ్ వాక్థాన్ నిర్వహిస్తున్నట్లు ఇన్టాక్ రాష్ట్ర కో-కన్వీనర్ అనురాధారెడ్డి తెలిపారు.
*ఈనెల 16న సికింద్రాబాద్లోని గురుస్వామి సెంటర్లో ఇండియన్ క్లాసికల్ మెలోడీస్ కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు సింగర్, ఇకెబెన ఇంటర్నేషనల్ మెంబర్ నీరజ గోదవర్తి బుధవారం తాజ్ డెక్కన్లో వివరాలు వెల్లడించారు.
* తన బతుకంతా తెలంగాణకు వెచ్చించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ధన్యజీవి అని పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్రావు నివాళులర్పించారు.
*సమాచార హక్కు (స.హ) చట్టం కింద ప్రతీ ప్రభుత్వ శాఖ లేదా విభాగం, సంస్థ ఖర్చు పెట్టే నిధుల లెక్కలన్నింటినీ పక్కాగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆయా శాఖల వెబ్సైట్లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
*ఓటర్ల జాబితా సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పెంచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
*రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. బుధవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్లో 13.5, మెదక్లో 14.8, ఆదిలాబాద్లో 15.2, హైదరాబాద్లో 17.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఈస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవటం ఇదే తొలిసారి. చలి ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
*పంటల మార్పిడి విధానం పాటించేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రబీ పంటల సాగుపై అన్ని విభాగాల అధికారులతో బుధవారం హాకా భవన్లో ఆయన సమీక్ష జరిపారు.
*రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా బౌద్ధ పురాతత్త్వ అంతర్జాతీయ సమ్మేళనం జరగనుంది. తెలంగాణ బౌద్ధ సంగీతి-2019 పేరిట ఈ నెల 16, 17 తేదీల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, వారసత్వ అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది.
*ఎన్నికలప్పుడు పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టకుండా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయగా ఉంటున్నా.. స్వాధీనం చేసుకున్న నగదు కేసుల్లో మాత్రం పురోగతి లేదని హైదరాబాద్ సుపరిపాలన వేదిక చెబుతోంది.
*ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రారంభించనున్న ఆంగ్లమాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిణిగా వెట్రిసెల్వీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు త్వరలో స్వయంప్రతిపత్తి హోదా లభించబోతోంది.
*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) 2019-20 సంవత్సరానికి కేంద్రంవిడుదల చేసిన రూ.1845కోట్ల నిధుల్ని గ్రామ పంచాయతీలకు ఎందుకు బదిలీ చేయలేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
*ప్రభుత్వం ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం’ కింద, స్వయంసహాయక సంఘ సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించి రూ.1,236 కోట్లమేర వడ్డీని డిసెంబర్ నెలాఖరులోగా వారి ఖాతాల్లో జమ చేయనుంది.
*వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తమను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి వాపోయారు.
*ఏపీ ఫైబర్ నెట్పై నిఘా విభాగం దృష్టి సారించింది. సంస్థ చేసిన ఖర్చుల వివరాలను సేకరిస్తోంది. ఒకే కనెక్షన్ ద్వారా నెట్, టీవీ, ఫోన్ సేవలను భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీబీఎన్ఎల్) అందిస్తున్న విషయం విదితమే.
*పట్టణ పరిధిలోని సౌకర్యవంతమైన ఇళ్ల విభాగంలో పునాది స్థాయిలోని 1.25 లక్షల గృహాలకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించింది. వీటికి విడతల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. తొలిగా శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని 28 వేల ఇళ్లకు దాఖలైన టెండర్లను శుక్రవారం తెరవనున్నారు.
*ప్రభుత్వ అసమర్థతతోనే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 3వ వార్డులో ఇటీవల ఇసుక కొరతతో పనుల్లేక ఆత్మహత్యకు పాల్పడిన అడపా రవి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.లక్ష చెక్కు అందజేశారు.
*రాష్ట్రానికి తరలివచ్చిన పరిశ్రమల జాబితాను కొత్త ఏడాదిలో ఆధారాలతో సహా ప్రజలు ముందు ఉంచుతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు. పరిశ్రమలు, ఐటీ విభాగంపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు