Devotional

ధ్వజస్తంభం ఎదురుగానే సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి?

Why should you do a full body namaskar in front of dhvaja stambhaM?

దేవాలయానికి వెళ్ళిన భక్తుల్లో కొందరు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. దైవానికి ఎదురుగా చేతులు చాచి దేహాన్ని పూర్తిగా నేలకి తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అయితే సాష్టాంగ నమస్కారం ధ్వజస్తంభం దగ్గరే చేయాలనే నియమం ఆధ్మాత్మిక గ్రంథాల్లో ఉంది. సాష్టాంగ నమస్కారం ధ్వజస్థంభం దగ్గర చేయడం వల్ల ఆ నమస్కారం తప్పకుండా దైవానికి చేరుతుందట. అంతేకాకుండా సాష్టాంగ నమస్కారం కోసం బోర్లా పడుకున్నప్పుడు కాళ్ళ భాగం దిశలో ఎలాంటి దేవతామూర్తులు ఉండరట. ఆలయంలోని ముఖ మండపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్ళు ఆ దైవం వాహనం వైపుకు వస్తాయట.  కొన్ని ఆలయాల్లో ముఖ మండపంలో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్ళు ఉపాలయాల వైపు ఉంటాయట. అందువల్ల ఎలాంటి దైవ సంబంధమైన వాహనాల వైపు ఉప ఆలయాల వైపు కాళ్ళు పెట్టకుండా ఉండటం కోసం ధ్వజస్థంభం దగ్గర నిర్ధేశించిన ప్రవేశంలోనే సాష్టాంగ నమస్కారం చేయాల్సి ఉంటుందంటున్నారు.