DailyDose

50వేల తుపాకీలు తిరిగి ఇచ్చేశారు-నేరవార్తలు-12/21

New Zealanders Return 50000 Guns Back-Telugu Crime News Roundup-12/21

* ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత ఆ దేశం ప్ర‌జ‌ల నుంచి తుపాకుల స్వాధీనం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 20వ తేదీన ఆ డెడ్‌లైన్ ముగిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 50 వేల తుపాకులను ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి అప్ప‌గించారు. దాంట్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన సెమీ ఆటోమెటిక్ ఆయుధాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయుధాల స్వాధీనం స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అక్ర‌మంగా ఆయుధాలు క‌లిగి ఉన్న‌వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో క్రైస్ట్‌చ‌ర్చ్‌లోని మ‌సీదుల‌పై ఓ ఉన్మాది జ‌రిపిన కాల్పుల్లో 51 మంది మృతిచెందారు. దాంతో కివీస్ ప్ర‌భుత్వం ఆయుధాల అప్ప‌గించాల‌ని పిలుపునిచ్చింది. సుమారు 33 వేల మంది దాదాపు 51 వేల గ‌న్నుల‌ను అంద‌జేశారు.

* పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న వేళ… ఆ చట్టాన్ని సమర్థిస్తూ ప్రకటన విడుదల చేశారు 1100 మంది ప్రొఫెసర్లు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్​ల నుంచి వచ్చి శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బిల్లుకు ఆమోదం తెలిపిన పార్లమెంటుకు, ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు పలు వర్సిటీల అధ్యాపకులు, యూజీసీ సభ్యులు.

* జర్నలిస్టు లపై దాడికి పాల్పడిన ఓ డ్రైవర్, గన్ మెన్ లను రూరల్ సి ఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాసరెడ్డి నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు

* తుళ్ళూరులో ఉన్న పంచాయితీ….గ్రామ సచివాలయానికి రంగులు మార్చిన రైతులు వైసీపీ అభిమానులే కడుపు మండి రంగులు మారుస్తున్నాం అంటున్నారు మాకు న్యాయం చెయ్యలేని ఈ ప్రభుత్వ రంగులు ఇక్కడ ఉండటానికి వీలులేదు

* దిశ హత్యాచార నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య మైనరు అని తేలింది. నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. ఆ బాలిక వయసు 13సంవత్సరాల ఆరు నెలలుగా (జన్మదినం: 15-06-2006)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి కూడా. దీంతో చెన్నకేశవులు తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వారు అంగీకరించలేదు. ఆ బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఉండేది. చెన్నకేశవులును ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రసుత్తం వారిద్దరు బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు. దీనిపై ప్రాథమిక నివేదికను తయారు చేశామని, దానిని ఉన్నతాధికారులకు పంపిస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారి రాములు తెలిపారు.

* ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో మృతదేహాలు సగం కుళ్లిపోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌ హైకోర్టుకు తెలిపారు. మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణకు ఆయన హాజరయ్యారు. ఐదారురోజుల్లో మృతదేహాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని కోర్టుకు వివరించారు. మృతదేహాల అప్పగింత అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు సహాయ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కోరగా.. ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్టుమార్టం చేశారని అడ్వకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. మళ్లీ పోస్టుమార్టం చేయాలని పిటిషనర్లు కూడా అడగలేదని, హైకోర్టు దృష్టికి తెచ్చారు.

* మందడం మెయిన్ సెంటర్ వద్ద రోడ్ కు అడ్డుగా ఫ్లెక్సీలను కట్టిన రైతులు. ప్రధాని మోడీ, అమిత్ షా, పవన్కళ్యాణ్, బుద్ధుడు విగ్రహాల తో ఫ్లెక్సీలు. మందడం మెయిన్ సెంటర్ లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు.

* గంజాయి తాగుతున్న నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన శనివారం మంగళగిరి లో చోటు చేసుకుంది. మంగళగిరి మండలం చినకాకాని గ్రామం మురుగన్‌ హోటల్‌ సమీపంలోని ఓ స్విఫ్ట్‌ కారులో గంజాయి తాగుతున్న నలుగురు కెఎల్‌యు యూనివర్సిటీ విద్యార్థులను మంగళగిరి ఎక్సైజ్‌ డిపార్ట్మెంట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల వివరాలను తెలియనీయకుండా గోప్యంగా ఉంచి నిందితులను కేసు నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.

* రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు నూతనంగా ఆన్ లైన్ విధానం అమలు చెయ్యడంతో నెట్ సెంటర్ల వద్ద జర్నలిస్టులు క్యూలు కడతున్నారు. సర్వర్ పనిచెయ్యకపోవడంతో తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఈ నెల 23న అక్రిడేషన్ చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకునేందుకు జర్నలిస్టులు ఆన్లైన్ సెంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. దీంతో ఐపీఆర్ వెబ్ సైట్ కు సంబంధించి సర్వర్ బిజీ అయ్యంది. వెబ్ సైట్ ఓపెన్ అవడం లేదు. జిల్లాలోని పలువురు జర్నలిస్టులు దరఖాస్తు కోసం నెల్లూరు నగరానికి చేరుకుని నెట్ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ బిజీగా ఉండడంతో తలలు పట్టుకుంటున్నారు. మరో మూడు రోజులు గడువు పొడించ వలసిందగా పలువురు జర్నలిస్టు మిత్రులు కోరుచున్నారు.